
గాంధీభవన్‌లో జరిగిన ఉగాది వేడుకలో పచ్చడి సేవిస్తున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది గ్రహస్థితుల ప్రకారం శని రాజుగా ఉన్నాడని, దీంతో రాష్ట్రంలో పంటలు సంతృప్తిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని జ్యోతిష పండితుడు చిలుకూరి శ్రీనివాసమూర్తి చెప్పారు. శుభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నాయకులు దామోదర రాజనర్సింహ, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి, గోపిశెట్టి నిరంజన్, కుమారరావు, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన చిలుకూరి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం వైద్యంపై ఎక్కువగా ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికాతో భారతదేశ సంబంధాలు బాగుంటాయని, పాకిస్తాన్, చైనాలతో వైరం ఉంటుందని అన్నారు.
నదుల అనుసంధానం కోసం చర్చలు జరుగుతాయని, కేంద్రంలో ఓ ముఖ్య నాయకుడి మరణ వార్త వింటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందని, తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పొత్తులకు ప్రయత్నిస్తుందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారని, అక్టోబర్‌లో రేవంత్‌రెడ్డి మరింత విజృంభిస్తారని శ్రీనివాసమూర్తి జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment