
పచ్చడి సేవిస్తున్న కిషన్‌రెడ్డి, బండి, విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ఏడాది ప్రజాసంగ్రామ సంవత్సరం.. ధర్మ విజయ సంవత్సరం’అని శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. కొత్త ఏడాదిలోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందా అని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి పంచాంగ ప్రవచనకర్త శర్మను అడగ్గా ప్రతిపక్షాల బలం వల్ల ప్రభుత్వం కాస్త గుణపాఠం నేర్చుకోకతప్పదని ఆయన బదులిచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘దే శం, రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉం డాలని దేవుడిని కోరుకుంటున్నా. అందరూ అనుకున్న లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’అని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ‘కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనలో ప్రజలపై మోపిన భారాలు కొత్త సంవత్సరంలో తొలగిపోవాలి.
ప్రజలకు మేలు జరగాలి. బీజేపీ శాంతియుత మార్గంలో చేపట్టే పోరాటాలకు ప్రజలు అండగా నిలవాలి’అని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, విజయశాంతి, కె.స్వామిగౌడ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి, ఆలె భాస్కర్, గీతామూర్తి పాల్గొన్నారు.