న్యూ జెర్సీ : స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం స్పందన ఫౌండేషన్ ఈ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన విరాళాలతో ఖమ్మంలోని స్పందన మేఫి మానసిక వికలాంగుల గృహంకి నూతన భవన సముదాయం కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 1300 మందికి పైగా అతిథులు పాల్గొన్న ఈ ఉగాది వేడుకల్లో 450 మంది వివిధ సంస్కృతికి ప్రదర్శనలతో అతిథులను అలరించారని నిర్వాహకులు నాగరాజు రెడ్డి తెలిపారు. చిత్రలేఖనం, చదరంగం పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న వారికి ఇచ్చే అవార్డును ఈ ఏడాదికిగానూ, స్పందన స్టార్ అవార్డు సంజన మల్ల, సాహితి తోలేటిలకు స్పందన సర్వీస్ అవార్డు ఇందిర శ్రీరాంలకు బహుకరించినట్టు స్పందన ప్రతినిధి ప్రశాంతి మదుపూరు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లకు శ్రీధర్ పొందూరి కృతజ్ఞతలు తెలిపారు.
స్పందన ఫౌండేషన్ భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు-విద్యాలయ, పేద విద్యార్థులకు-ప్రతిభ, నిరాశ్రయులకు-ఆశ్రయ, క్లిష్టమైన అనారోగ్య సమస్యలున్న వారికి-చేయూత వంటి కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment