Spandana foundation
-
స్పందన ఫౌండేషన్ అధ్వర్యంలో దివాళి ధమాకా
స్పందన ఫండేషన్ అధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు సహాయార్ధం దివాళీ ధమాకా కార్యక్రమం ఘనంగా జరిగింది. మాంట్ గోమరీ అప్పర్ మిడిల్ స్కూల్ ఆడిటోర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాజు ఆనంద్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దోహదం చేసిన కార్యకర్తలు ఫణీంద్ర నెక్కంటి, శ్రీరాం పొందూరి, రమేష్ గుత్తా, కిషోర్, రవిదొడ్డలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
న్యూ జెర్సీ : స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం స్పందన ఫౌండేషన్ ఈ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన విరాళాలతో ఖమ్మంలోని స్పందన మేఫి మానసిక వికలాంగుల గృహంకి నూతన భవన సముదాయం కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 1300 మందికి పైగా అతిథులు పాల్గొన్న ఈ ఉగాది వేడుకల్లో 450 మంది వివిధ సంస్కృతికి ప్రదర్శనలతో అతిథులను అలరించారని నిర్వాహకులు నాగరాజు రెడ్డి తెలిపారు. చిత్రలేఖనం, చదరంగం పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న వారికి ఇచ్చే అవార్డును ఈ ఏడాదికిగానూ, స్పందన స్టార్ అవార్డు సంజన మల్ల, సాహితి తోలేటిలకు స్పందన సర్వీస్ అవార్డు ఇందిర శ్రీరాంలకు బహుకరించినట్టు స్పందన ప్రతినిధి ప్రశాంతి మదుపూరు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లకు శ్రీధర్ పొందూరి కృతజ్ఞతలు తెలిపారు. స్పందన ఫౌండేషన్ భారత్లోని ప్రభుత్వ పాఠశాలలకు-విద్యాలయ, పేద విద్యార్థులకు-ప్రతిభ, నిరాశ్రయులకు-ఆశ్రయ, క్లిష్టమైన అనారోగ్య సమస్యలున్న వారికి-చేయూత వంటి కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందిస్తోంది. -
స్పందన ఫౌండేషన్ బ్యాడ్మింటన్ పోటీలు
కాలిఫోర్నియా : సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బే ఏరియాలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో సాస్ రామొస్కి చెందిన విద్యార్థులు కోటపాటి సాకేత్, పోపూరి శ్రియలు స్పందన ఫౌండేషన్ వారిని కలిసి సహ వ్యవస్థాపకులైన లంకిపల్లి గిరి సహాయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఖమ్మంకు చెందిన మానసిక వికలాంగుల ప్రాథమిక అవసరాలను తీర్చడం, డీఐజీ కేన్సర్ పై పరిశోధన జరిపే లూసిల్ల్ పేకార్డ్, స్టాంఫోర్డ్ పరిశోధనా బృందాలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించారు. డౌహెర్టీ వేలీ హై స్కూల్ జింలో జరిగిన ఈ టోర్నీలో 127 మంది బ్యాడ్మింటన్ ప్రియులు పాల్గొన్నారు. గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేశారు. 2005లో స్థాపించిన స్పందన ఫౌండేషన్ భారత్లోని ప్రభుత్వ పాఠశాలలకు-విద్యాలయ, పేద విద్యార్థులకు-ప్రతిభ, నిరాశ్రయులకు-ఆశ్రయ, క్లిష్టమైన అనారోగ్య సమస్యలున్న వారికి-చేయూత వంటి కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందిస్తోంది. స్పందన ప్రతినిధులు శరత్ పోపూరి, శ్రీనివాస్ కోటపాటి మాట్లాడుతూ లావణ్య దువ్వి, బిస్ టాంగ్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎన్ ఆర్ ఐ అడ్డా, విండిమియర్ రియాలిటీ, గ్రేట్ అమెరికన్ డెంటల్, ఆజాద్ అరమండ్ల, బిర్యానీజ్, వెంకటేశ్వరా భవన్, స్పందన వాలంటీర్లలకు కృతజ్ఞతలు తెలిపారు.