కాలిఫోర్నియా : సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బే ఏరియాలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో సాస్ రామొస్‌కి చెందిన విద్యార్థులు కోటపాటి సాకేత్, పోపూరి శ్రియలు స్పందన ఫౌండేషన్ వారిని కలిసి సహ వ్యవస్థాపకులైన లంకిపల్లి గిరి సహాయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఖమ్మంకు చెందిన మానసిక వికలాంగుల ప్రాథమిక అవసరాలను తీర్చడం, డీఐజీ కేన్సర్ పై పరిశోధన జరిపే లూసిల్ల్ పేకార్డ్, స్టాంఫోర్డ్ పరిశోధనా బృందాలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. డౌహెర్టీ వేలీ హై స్కూల్ జింలో జరిగిన ఈ టోర్నీలో 127 మంది బ్యాడ్మింటన్ ప్రియులు పాల్గొన్నారు. గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేశారు.
2005లో స్థాపించిన స్పందన ఫౌండేషన్ భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు-విద్యాలయ, పేద విద్యార్థులకు-ప్రతిభ, నిరాశ్రయులకు-ఆశ్రయ, క్లిష్టమైన అనారోగ్య సమస్యలున్న వారికి-చేయూత వంటి కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందిస్తోంది. స్పందన ప్రతినిధులు శరత్ పోపూరి, శ్రీనివాస్ కోటపాటి మాట్లాడుతూ లావణ్య దువ్వి, బిస్ టాంగ్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎన్ ఆర్ ఐ అడ్డా, విండిమియర్ రియాలిటీ, గ్రేట్ అమెరికన్ డెంటల్, ఆజాద్ అరమండ్ల, బిర్యానీజ్, వెంకటేశ్వరా భవన్, స్పందన వాలంటీర్లలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment