
కౌలాలంపూర్, మలేసియా : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు మలేషియాలోని మరిడేక స్క్వేర్‌లో అట్టహాసంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా(టామ్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఫెడరల్ టెరిటోరిస్ మంత్రి తంకూ అద్నాన్ మన్సూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వేడుకల సందర్భంగా చిన్నారుల ఆట పాటలు, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి. టామ్ అధ్యక్షులు డీఆర్ అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.





