
బ్రిస్టల్: శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు బ్రిస్టల్లో ఘనంగా నిర్వహించారు. బ్రిస్టల్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 250 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, బూరెలు, కమ్మని తెలుగు వంటకాలు పంపిణి చేశారు. దిలీప్ మెరుగుమల్లి, వంశి మూల ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలు, లలితకళల ప్రదర్శనలు, తెలుగు సాహితీ అభిమానులను కూడా అలరించే పద్యాలతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు . తెలుగు సినిమా సంగీత నృత్యాలు, నాటికలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాజేంద్రప్రసాద్, శ్రావ్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
శ్రీనివాస కిరీటి బోయినపల్లి బ్రిస్టల్ తెలుగు సంఘం తరుపున మాట్లాడుతూ తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని, ఐక్యతను, సంస్కృతిని కాపాడటానికి బ్రిస్టల్ తెలుగు సంఘం ఏర్పడిందని తెలిపారు. ఈ ఉగాది సంబరాలు విజయవంతం కావడానికి విద్యాసాగర్ రెడ్డి, ప్రసాద్ పచ్చాల, సతీష్, శివ కొండపర్తి, హరి బాబు, రవి వింజమూరి, శ్రీనివాస మూర్తి, శివాంజనేయులు, ప్రసాద్ బత్తల, గిరీష్ బిందు మాధవ్, సుధాకర్, చిరంజీవి మాదాల, శ్రీదేవి, జ్ఞాని, శ్రావణి, భవాని కెంచే, డా. దీప సునీల్ రెడ్డి, రోహిణి మాటూరి, బిందు కొణిదలు ఎంతగానో కృషి చేశారు.
మరిన్ని ఫోటోలు..





Comments
Please login to add a commentAdd a comment