జనహితలో ఉ.10.30కి ఉగాది వేడుకలు | Ugadi celebrations at Janahita | Sakshi
Sakshi News home page

జనహితలో ఉ.10.30కి ఉగాది వేడుకలు

Published Tue, Mar 28 2017 3:26 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

జనహితలో ఉ.10.30కి ఉగాది వేడుకలు - Sakshi

జనహితలో ఉ.10.30కి ఉగాది వేడుకలు

ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: శ్రీ హేవళంబి నామ ఉగాది వేడుకలు ఈసారి హైదరాబాద్‌ బేగంపేట్‌ రోడ్డులోని జనహిత, సీఎం క్యాంపు కార్యాలయ సముదాయంలో నిర్వహిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికా రులు మునిగిపోయారు. ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు ప్రారంభమవుతాయి.

మొదట నాదస్వరం, పూర్ణకుంభ స్వాగతం, ప్రార్థనాగీతం, వేదాశీ ర్వచనం, పంచాంగ పఠనం, వేదపండితులకు, అర్చకు లకు, ఆధ్యాత్మికవేత్తలకు సత్కారం, ఉగాది నృత్యరూపకం నిర్వ హించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌ పాల్గొననుండగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రకాశనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, పలువురు మంత్రులు, నగర మేయర్‌ తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement