ఉగాదికి కళారత్న పురస్కారాలు..
Published Fri, Mar 17 2017 7:34 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
అమరావతి: హేవలంబి నామ ఉగాది ఉత్సవాల నిర్వహణ, కళారత్న పురస్కారాల ఎంపికకు సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ శక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మండలికి ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహిరిస్తారని, వివిధ విభాగాల చెందిన 12 మంది ప్రముఖులు సభ్యులుగా ఉంటారని సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ మండలి ఉగాదిపురస్కారాల నిర్వహణ, కళారత్న ( హంస) పురస్కారాల విజేతలను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు.
మార్చి 29న జరగబోయే ఉగాది ఉత్సవాల్లో భాషా సాంస్కృతిక శాఖ కళారత్న (హంస) పురస్కారాలు ఇవ్వనుంది. ఈ పురస్కారానికి ఎంపికైనవారికి ఒక్కొక్కరికి రూ. 50,000లు, హంస ప్రతిమలు, శాలువ ప్రశంసా పత్రం బహుకరిస్తారు. వివిధ రంగాలు సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానంలో ప్రతిభ కనబర్చినవారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఉగాది రోజు నిర్వహించే పోటీల్లో గెలిచిన వారికి రూ.10,116/-లు, శాలువ ప్రశంసాపత్రం, తెలుగు తల్లి జ్ఞాపిక బహుకరిస్తారు. ఈ కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖతో పాటు దేవాదయ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, తిరమల తిరుపతి దేవస్థానములు పాలుపంచుకుంటాయి.
Advertisement