Buddhaprasad
-
టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. పిఠాపురం జనసేన నేతలతో పవన్
పిఠాపురం: ‘టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. వాళ్లను ఫాలో అవ్వండి’ అని తన పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సూచించారు. పిఠాపురం పర్యటనను ఆదివారం అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. సోమవారం మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన నేతలందరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరుతో ఫొటో దిగాలని ఉందని, పరిస్థితులు అనుకూలించగానే రోజుకు 200 మందితో ఫొటోలు దిగాలని భావిస్తున్నట్టు తెలిపారు. తన విజయం కోసం స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మెజారిటీ ఎంత తీసుకురావాలనేది వారిపైనే వదిలేస్తున్నానని, వారు పడే కష్టం మీదే తన మెజారిటీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్, పాలకొండకు చెందిన నిమ్మక జయకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. సాయంత్రం పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతా టీడీపీ నేతలతోనే అని పవన్ అంటుంటే.. ఇక తామెందుకు అంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తుంటే ఎవరి కిందో పని చేయాలనడం ఎంత వరకూ సమంజసమంటూ పవన్ తీరుపై వారు రుసరుసలాడుతున్నారు. -
బాబు, పవన్ డబుల్‌గేమ్‌పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్‌గేమ్‌పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్‌కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్‌కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్‌ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్‌నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్‌నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
ఉగాదికి కళారత్నపురస్కారాలు..
అమరావతి: హేవలంబి నామ ఉగాది ఉత్సవాల నిర్వహణ, కళారత్న పురస్కారాల ఎంపికకు సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ శక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మండలికి ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహిరిస్తారని, వివిధ విభాగాల చెందిన 12 మంది ప్రముఖులు సభ్యులుగా ఉంటారని సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ మండలి ఉగాదిపురస్కారాల నిర్వహణ, కళారత్న ( హంస) పురస్కారాల విజేతలను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. మార్చి 29న జరగబోయే ఉగాది ఉత్సవాల్లో భాషా సాంస్కృతిక శాఖ కళారత్న (హంస) పురస్కారాలు ఇవ్వనుంది. ఈ పురస్కారానికి ఎంపికైనవారికి ఒక్కొక్కరికి రూ. 50,000లు, హంస ప్రతిమలు, శాలువ ప్రశంసా పత్రం బహుకరిస్తారు. వివిధ రంగాలు సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానంలో ప్రతిభ కనబర్చినవారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఉగాది రోజు నిర్వహించే పోటీల్లో గెలిచిన వారికి రూ.10,116/-లు, శాలువ ప్రశంసాపత్రం, తెలుగు తల్లి జ్ఞాపిక బహుకరిస్తారు. ఈ కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖతో పాటు దేవాదయ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, తిరమల తిరుపతి దేవస్థానములు పాలుపంచుకుంటాయి. -
పంటలెండిపోతున్నా స్పందించరేం?
ఉపసభాపతి బుద్ధప్రసాద్‌ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి అవనిగడ్డ : దివిసీమలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్న పంటను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, అయినా స్థానిక ప్రజాప్రతినిధి మండలి బుద్ధప్రసాద్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో మంత్రిగా ఉన్న బుద్ధప్రసాద్ కొద్దిరోజులు సాగునీరు అందకపోతేఆందోళన చేశారని, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారని, ఈ నీరు ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు అందించలేని దుస్థితిలో ఉంటే స్థానిక ప్రజాప్రతినిధిగా మౌనం వహించడం వెనుక మర్మమేమిటని అన్నారు. ఇప్పటికైనా ఉపసభాపతి బుద్ధప్రసాద్ స్పందించి దివిసీమలో సాగునీరందక చనిపోతున్న పంటను బతికించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సింహాద్రి సూచించారు. -
వాడీవేడిగా జెడ్పీ సమావేశం
ఎజెండా పత్రాలు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు ప్రొటోకాల్‌పై నిలదీసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు మచిలీపట్నం : జిల్లా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో పాల్గొనాలని మంత్రి దేవినేని ఉమా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సమావేశంలో కొద్దిసేపు ప్రసంగించి వెళ్లిపోయారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమను మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఏ హక్కుతో హాజరవుతున్నారంటూ కొన్ని మండలాల్లో ప్రశ్నిస్తున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీలు, మంత్రుల పర్యటనల వివరాలు తమకు తెలియజేయకుండానే ముగిస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఎంతమందికి చేశారు.. ఎంత మొత్తం చేశారు.. నియోజకవర్గాల వారీగా జాబితాలు ఉన్నాయా.. లేవా.. ఈ విషయంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. జిల్లాలో బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతున్నాయని, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఇస్తున్నారని, వీటిని రద్దు చేస్తారా, లేదా.. అని కల్పన నిలదీశారు. అనంతరం గూడూరు మండల పరిషత్ సమావేశంలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులను మాట్లాడొద్దని అధికారులే హుకుం జారీ చేస్తున్నారని, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆ పార్టీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అజెండా కాపీలు అందలేదు.. జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్నా ఇంతవరకు సభ్యులకు ఎజెండా కాపీలను ఇవ్వలేదని, తాము ఏ అంశాలపై చర్చించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించకూడదనే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సామాజిక పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు మంజూరు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చిన లబ్ధిదారులకు కాకుండా వేరే జాబితాలను తయారు చేసి రుణాలు ఇప్పించేందుకు గ్రామకమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక వ్యవహారంపై రగడ భూగర్భ గనుల శాఖపై జరిగిన సమీక్షలో ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయాన్ని గండికొట్టడం తదితర అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో ఇసుక సీనరేజీ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా జిల్లా పరిషత్‌కు జమ అయ్యేదని, ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించి నిధులను తన ఖాతాలో వేసుకుంటోందని, మొక్కుబడిగా క్యూబిక్ మీటరుకు రూ.40లు మాత్రమే ఇస్తోందని తోట్లవల్లూరు ఎంపీపీ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఇసుక రేవులు ఉన్న గ్రామాల పరిధిలో గృహనిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లపై ఇసుక తీసుకువెళుతున్నా పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వాటిని సీజ్ చేసి రూ. 15వేలు జరిమానా విధిస్తున్నారని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో పాటు పలువురు సభ్యులు పేర్కొన్నారు. అయితే పెద్ద లారీల ద్వారా హైదరాబాదుకు తరలివెళుతున్న ఇసుకను అదుపు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో సభ్యులకు సరైన సమాచారం ఇవ్వటం లేదని, గత సమావేశంలో అడిగిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యత పెరిగింది : బుద్ధప్రసాద్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జిల్లా ప్రజలపై బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా సరిహద్దులోనే రాజధాని ఏర్పడనున్న సమయంలో మనపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించానని, కృష్ణాజిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయటంతోపాటు ఎన్ఆర్ఐలు నగదు పంపేందుకు ప్రభుత్వం ద్వారానే ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయాలని కోరారు. తొలుత హుదూద్ తుపాను ప్రభావంతో మరణించిన వారు, ఇటీవల షిర్డీ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. నూతనంగా 41,814 మందికి పింఛన్లు : ఉమా సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ. 12.31 కోట్లను పింఛన్లుగా అందజేశామన్నారు. తొలుత జిల్లాలో 14వేల మంది పింఛన్లు పొందేందుకు అనర్హులుగా గుర్తించగా, వీటిని పునఃపరిశీలించి 7,936 మందికి పునరుద్ధరించినట్లు తెలిపారు. జిల్లాలో 33,878 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నవంబరులో జరిగే జన్మభూమిలో నూతన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మండలాల్లో, జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, అలా చేయని పక్షంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో రెండో పంటకు సాగునీరు విడుదల చేసే విషయమై నవంబరులో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతిపక్షం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : కొల్లు రవీంద్ర జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ సభ్యులు నిర్ణయాత్మక పాత్రను పోషించాలని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసిందని, మొదటి విడతగా రూ. 5వేల కోట్లను విడుదల చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలు, ఆస్పత్రులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ అవసరమన్నారు. బెల్టు షాపులు అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోంటుందని చెప్పారు. -
సమైక్య పోరులో ఎన్జీవోల పాత్ర అనిర్వచనీయం
డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ అవనిగడ్డ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు పోరాడిన తీరు అనిర్వచనీయమని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం దివి యూనిట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా రాష్ట్రం ముక్కలు కాకూడదనే సంకల్పంతో ఎన్జీవో సంఘ నాయకులు సీమాంధ్రలో నిర్వహించిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత జేఏసీ నాయకులు రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పదవులను చేపట్టారని, ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును వివిధ పార్టీలు ఆహ్వానించినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారని అభినందించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఉద్యోగులంటే గతంలో తనకు సదాభిప్రాయం లేదని, సమైక్యాంధ్ర కోసం 82 రోజులపాటు వారు ఉద్యమించిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి బుద్ధి చెప్పిన ఘనత సీమాంధ్ర ప్రజలకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన బుద్ధప్రసాద్, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, అశోక్‌బాబులను సన్మానించారు. ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, ఎన్జీవో సంఘం నాయకులు దారపు శ్రీనివాస్, ఎ.విద్యాసాగర్, ఎండీ ఇక్బాల్, దివి యూనిట్ అధ్యక్షుడు బి.రాజేంద్రకుమార్, కార్యదర్శి ఎస్.వెంకట సందీప్, తూర్పు కృష్ణా నాయకుడు అబ్దుల్ అజీజ్, సన్‌ఫ్లవర్ గ్రూప్ విద్యాసంస్థల అధినేత ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్(రాజా), పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది
తెలుగు సాహితీ సదస్సులో బుద్ధప్రసాద్ విజయవాడ కల్చరల్ : ప్రపంచం తెలుగువారికి వేదిక కావాలని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సులో మాట్లాడుతూ,తెలుగు భాషాసంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు సమాఖ్యఅని, భాషా సంస్కృతులను వాటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి అభివృద్ధికోసం ప్రపంచ తెలుగు సమాఖ్య పాటుపడుతోందని వివరించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారిని ఏకం చేసేది సాంస్కృతిక వారసత్వమేనని గుర్తుచేశారు. రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని కొత్తరాష్ట్రంలోని కవులు రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచేలా రచనలు చేయాలని ఉద్భోదించారు. భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ భాషా సంస్కృతీ సంప్రదాయాలను కవులు గౌరవించి తమ రచనల ద్వారా తెలుగు జాతిని జాగృత పరచాలన్నారు. కవి సమ్రాట్ విశ్వనాథ ఇంటిని ముఖ్యమంత్రి గారితో కలసి సందర్శించి, విశ్వనాథగృహాన్ని తెలుగు భాషా సంస్కృతులు వెల్లివిరిసేలా పరిరక్షిస్తామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు జ్యోతిని వెలిగించి తెలుగు సాహితీ సదస్సులను ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు వియల్ ఇందిరాదత్ మహాసభ లక్ష్యాలను వివరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు ఆవుల మంజులత, సిద్ధార్థఅకాడమీ కార్యదర్శి పాలడుగు లక్షణరావు, కష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాలడుగు లక్షణరావు పాల్గొన్నారు. మాతెలుగు తల్లికి మల్లెపూదండ... సభా ప్రారంభానికి ముందు ప్రపంచ తెలుగు సమాఖ్య అద్యక్షులు వి.ఎల్. ఇందిరాదత్, పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం పూర్వధ్యక్షులు ఆవుల మంజులత,కవులు డాక్టర్ జి.వి.పూర్ణచందు, చలపాక ప్రకాష్, గుమ్మా సాంబశివరావు, ఎరుకలపూడి గోపీనాథరావు, సీహెచ్.బృందావనరావు కళాక్షేత్రం వద్దనున్న తెలుగు తల్లివిగ్రహానికి పూలమాలలు వేశారు. పరిశోధనా పత్రాలు సమర్పణ... వెంకటగిరి సంస్థానంలో తెలుగు సాహిత్య కృషి అంశంపై డాక్ట్ర్ సాయికృష్ణ యాచేంద్ర ,తెలుగు ప్రాచీన సాహిత్యం సామాజిక అంశాల అవశ్యకతపై యార్లగడ్డ బాలగంగాధరరావు, నన్నయ్య పూర్వయగంపై ఆచార్య టి .సత్యవతి, కాకతీయానంతర సాహిత్య నేపథ్యంపై ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్,శిష్యబృందం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
గతమెంతో ఘనమైంది: గవర్నర్
చరిత్ర నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది పుస్తకావిష్కరణ సభలో గవర్నర్ ఉద్ఘాటన హైదరాబాద్: చరిత్ర అంటే కేవ లం రాజకీయ సంఘటనల పరిణామ క్రమం మాత్రమే కాదని, ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవితంలోని వైవి ధ్యాల సమగ్ర ఆవిష్కరణే చరిత్ర అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. జనజీవనంలోని ప్రతి అంశం చరిత్ర రచనలో నిక్షిప్తం కావాలన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి’ (మలియుగ ఆంధ్రప్రదేశ్ క్రీస్తు శకం 1324-1724) ఆంగ్ల గ్రంథం ఐదో సంపుటి ఆవిష్కణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘సాధారణంగా ప్రతి ఒక్కరూ రేపటి గురించే ఆలోచిస్తారు. చాలా మంది గతాన్ని గురించి పట్టించుకోరు. చాలా మందికి తమ తాతముత్తాల చరిత్రే తెలిసి ఉండకపోవచ్చు. అలాంటిది 1324 నుంచి 1724 వరకు 400 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్రను అద్భుతంగా గ్రంథస్తం చేసిన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సంస్థల కృషి అభినందనీయం’ అని ప్రశంసించారు. గతమే చరిత్ర అని, దాని నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నుంచే ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధబాంధవ్యాలు పరిఢవిల్లాయన్నారు. రాష్ర్ట విభజనతో తెలుగు విశ్వవిద్యాల యం భవిష్యత్తులో అలాంటి కృషినే కొనసాగిస్తుందా, లేక ప్రపంచ తెలుగు ప్రజల కోసం మరో సంస్థ అవసరమా తేలాల్సి ఉందన్నారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, గవర్నర్ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బి.పాపారావు, ఏపీ చరిత్ర-సంస్కృతి సమగ్ర సంపుటాల సంపాదకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, ఐదో సంపుటి సంపాదకులు ఆచార్య ఆర్.సోమారెడ్డి పాల్గొన్నారు.