సింగపూర్ : సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ లో గ్రీన్ వుడ్ ప్రైమరీ స్కూల్ స్పోర్ట్స్ హాల్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - 2017 నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్ కేటగిరీ లలో టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
టీసీఎస్‌ఎస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2017 విజేతల వివరాలు:
ఉమెన్స్ సింగిల్స్ : విన్నర్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి, రన్నర్ అప్- రాజేశ్వరి యెర్రం
ఉమెన్స్ డబుల్స్: విన్నర్స్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి/పొట్టూరి తులసి గిరీష్, రన్నర్ అప్- కస్తూరి గర్రెపల్లి/రమ్య జానపతి
మిక్స్‌డ్ డబుల్స్: విన్నర్స్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి / అన్నం పవన్ కుమార్, రన్నర్ అప్- రాజేశ్వరి యెర్రం/కులశేఖర్ రీగన్
మెన్స్ సింగిల్స్: విన్నర్- ఈసర్ల రమాపతి, రన్నర్ అప్- పొట్టూరి వర ప్రసాద రాజు
మెన్స్ డబుల్స్: విన్నర్- భరద్వాజ్ కేసంసెట్టి / ద్వారకనాథ్ మిట్టా, రన్నర్ అప్- అన్నం పవన్ కుమార్ /లక్ష్మణ కుమార్ మంగెన
ఈ టోర్నమెంట్ కు సమన్వయ కర్తలుగా నర్రా ఆర్ సి రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, సురేశ్ చిల్క, ఏళ్ల రామ్, చెట్టిపల్లి మహేశ్, గడప రమేష్ బాబులు వ్యవహరించారు. ఈ సందర్భంగా సొసైటి సభ్యులు మాట్లాడుతూ, సింగపూర్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందజేయడం కొరకు వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి లో క్రీడాస్పూర్తి ని పెంపొందించేందుకు వివిధ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో పాల్గొని విజయ వంతం చేసిన క్రీడాకారులందరికి కృతజ్ఞతలు తెలిపి, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి శ్రీనివాస్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, అంపైర్లకు, ప్రత్యేకంగా అన్నే అన్నె వంశీ కృష్ణ (జానిక్), సునీల్ సుబద్ర రాజు, రవి కుమార్ నీరుడు (కుమార్ ప్రాపర్టీస్)లకు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్
Published Thu, Nov 16 2017 11:20 AM | Last Updated on Sat, Nov 18 2017 11:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment