Badminton competitions
-
నేటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
సాక్షి,వరంగల్ స్పోర్ట్స్: మూడు రోజులపాటు కొనసాగనున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్–2018 పోటీలకు హన్మకొండలోని సుబేదారిలోని వరంగల్ క్లబ్ ముస్తాబైంది. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు గురువారం క్వాలీఫైయింగ్ రౌండ్స్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను చాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేశారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల వివరాలను సాయంత్రం వరంగల్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న పోటీలను శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు బి.చేతన్ ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారని తెలిపారు. వారందరికీ నగరంలోని కిట్స్, నిట్‌తోపాటు వివిధ ప్రైవేట్ హోటళ్లలో వసతి సదుపాయాలను కల్పించామని తెలిపారు. 11న జరిగే ముగింపు వేడుకలకు వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ సీహెచ్ దీప్తి హాజరై విజేతలకు బహుమతులను అందజేస్తారని తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు క్లబ్ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని అన్నారు. మూడు రోజులపాటు సాగనున్న క్రీడల నేపథ్యంలో తమ సభ్యులు సహకరించాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి పి.రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్ , టెక్నికల్ అఫీషియల్స్ కొమ్ము రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సింగపూర్ : సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ లో గ్రీన్ వుడ్ ప్రైమరీ స్కూల్ స్పోర్ట్స్ హాల్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - 2017 నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్ కేటగిరీ లలో టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. టీసీఎస్ఎస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2017 విజేతల వివరాలు: ఉమెన్స్ సింగిల్స్ : విన్నర్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి, రన్నర్ అప్- రాజేశ్వరి యెర్రం ఉమెన్స్ డబుల్స్: విన్నర్స్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి/పొట్టూరి తులసి గిరీష్, రన్నర్ అప్- కస్తూరి గర్రెపల్లి/రమ్య జానపతి మిక్స్డ్ డబుల్స్: విన్నర్స్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి / అన్నం పవన్ కుమార్, రన్నర్ అప్- రాజేశ్వరి యెర్రం/కులశేఖర్ రీగన్ మెన్స్ సింగిల్స్: విన్నర్- ఈసర్ల రమాపతి, రన్నర్ అప్- పొట్టూరి వర ప్రసాద రాజు మెన్స్ డబుల్స్: విన్నర్- భరద్వాజ్ కేసంసెట్టి / ద్వారకనాథ్ మిట్టా, రన్నర్ అప్- అన్నం పవన్ కుమార్ /లక్ష్మణ కుమార్ మంగెన ఈ టోర్నమెంట్ కు సమన్వయ కర్తలుగా నర్రా ఆర్ సి రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, సురేశ్ చిల్క, ఏళ్ల రామ్, చెట్టిపల్లి మహేశ్, గడప రమేష్ బాబులు వ్యవహరించారు. ఈ సందర్భంగా సొసైటి సభ్యులు మాట్లాడుతూ, సింగపూర్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందజేయడం కొరకు వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి లో క్రీడాస్పూర్తి ని పెంపొందించేందుకు వివిధ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో పాల్గొని విజయ వంతం చేసిన క్రీడాకారులందరికి కృతజ్ఞతలు తెలిపి, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి శ్రీనివాస్‌లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, అంపైర్లకు, ప్రత్యేకంగా అన్నే అన్నె వంశీ కృష్ణ (జానిక్), సునీల్ సుబద్ర రాజు, రవి కుమార్ నీరుడు (కుమార్ ప్రాపర్టీస్)లకు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
కడప స్పోర్ట్స్ : కడప నగరం వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 4నుంచి జరిగిన ఎస్జీఎఫ్ 62వ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ టోర్నీకి అన్నిరాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. పోటీలు, శిక్షణ శిబరం తేదీలు, వేదకల గురించి త్వరలో తెలియజేస్తామని బ్యాడ్మింటన్ టోర్నీ ప్రోగ్రాం డైరెక్టర్ జిలానీబాషా ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలను ప్రకటించారు. శిక్షణ శిబిరానికి ఎంపికైన క్రీడాకారులు బాలురు : ఉత్సవ్సోయ్ (దిల్లీ), సాయి కిరణ్ (తెలంగాణ), అనిరు«ద్కుశ్వాన (గుజరాత్), శ్యామ్‌ప్రసాద్ (కేరళ), తేజాస్ కల్లోల్కర్ (కర్ణాటక), మోహిత్ (హరియాణ), ఆయుష్రాజ్గుప్తా (యూపీ), భవేష్ (ఉత్తరాఖండ్), సుధాన్షుబూరే (మహారాష్ట్ర), అజింక జోషి (కర్ణాటక). బాలికలు : మాళవిక (మహారాష్ట్ర), వి.ఎస్.వర్షిణి (తమిళనాడు), తనిష్కాదేశ్పాండే (మహారాష్ట్ర), ఫరూఖీ (మహారాష్ట్ర), కె. వెన్నెలశ్రీ (ఏపీ), వై. ఆశ్రిత (ఏపీ), పి. అంజుజాస్మిన్ (కేరళ), సాయి నందూర్కర్ (మహారాష్ట్ర), డి.జె. ప్రతీక (తమిళనాడు), గరిమాసింగ్ (చత్తీస్ఘడ్).