అంతర్జాతీయ పోటీలకు ఎంపిక | అంతర్జాతీయ పోటీలకు ఎంపిక, The selection of for international competition | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పోటీలకు ఎంపిక

Published Sun, Jan 8 2017 11:44 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

అంతర్జాతీయ పోటీలకు ఎంపిక - Sakshi

అంతర్జాతీయ పోటీలకు ఎంపిక

కడప స్పోర్ట్స్‌ :  కడప నగరం వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 4నుంచి జరిగిన  ఎస్‌జీఎఫ్‌  62వ  జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ టోర్నీకి అన్నిరాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. పోటీలు, శిక్షణ శిబరం తేదీలు, వేదకల గురించి త్వరలో  తెలియజేస్తామని  బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రోగ్రాం డైరెక్టర్‌ జిలానీబాషా ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలను ప్రకటించారు.
శిక్షణ శిబిరానికి ఎంపికైన క్రీడాకారులు
బాలురు : ఉత్సవ్‌సోయ్‌ (దిల్లీ), సాయి కిరణ్‌ (తెలంగాణ), అనిరు«ద్‌కుశ్వాన (గుజరాత్‌), శ్యామ్‌ప్రసాద్‌ (కేరళ), తేజాస్‌ కల్లోల్కర్‌ (కర్ణాటక), మోహిత్‌ (హరియాణ), ఆయుష్‌రాజ్‌గుప్తా (యూపీ), భవేష్‌ (ఉత్తరాఖండ్‌), సుధాన్షుబూరే (మహారాష్ట్ర), అజింక జోషి (కర్ణాటక).
బాలికలు : మాళవిక (మహారాష్ట్ర), వి.ఎస్‌.వర్షిణి (తమిళనాడు), తనిష్కాదేశ్‌పాండే (మహారాష్ట్ర), ఫరూఖీ (మహారాష్ట్ర), కె. వెన్నెలశ్రీ (ఏపీ), వై. ఆశ్రిత (ఏపీ), పి. అంజుజాస్మిన్‌ (కేరళ), సాయి నందూర్కర్‌ (మహారాష్ట్ర), డి.జె. ప్రతీక (తమిళనాడు), గరిమాసింగ్‌ (చత్తీస్‌ఘడ్‌).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement