సింగపూర్లో బతుకమ్మ వేడుకలు | Bathukamma Celebrations at Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published Sun, Sep 24 2017 9:40 AM | Last Updated on Mon, Sep 25 2017 11:56 AM

Bathukamma Celebrations at Singapore

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సింగపూర్ తెలుగు సమాజం (ఎస్‌టీఎస్‌)తో కలిసి జరుపుకున్న బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్లో వైభవంగా జరిగాయి. సుమారు వెయ్యిమందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగపూర్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న టీసీఎస్‌ఎస్‌ను అభినందించారు. ఇలా సింగపూర్లో ఉన్న రెండు సంఘాలు స్నేహపూర్వక వాతావరణంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరు పాటలు, ఆటలతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో సంబరాలు మిన్నంటాయి. ఈ  సంబరాల్లో ఎంతో మంది పంజాబీలు, సింగపూర్ స్థానిక తమిళులతో పాటు ఎంతో మంది వివిధ రాష్ట్రాల వారు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఇంత గొప్ప పండుగను వారికి పరచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ నిర్వహించిన ఈ సంవత్సరపు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సంప్రదాయ వేషదారణకు బహుమతులు ఇవ్వడంజరిగింది. దీంతో పాటు సంబురాల్లో పాల్గొన్న ఓ అదృష్ట విజేతకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి తరపు నుంచి డైమండ్ పెండేంట్స్ అందించారు.
 
ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా ముదం స్వప్న, మొగిలి సునిత రెడ్డి, నడికట్ల కళ్యాణి, గోనె రజిత, చిట్ల విక్రమ్, టేకూరి నగేష్, రాజ శేఖర్, ప్రదీప్లు వ్యవహరించారు. ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని టీసీఎస్ఎస్‌ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఎస్‌టీఎస్‌ అధ్యక్షులు రవి రంగా తెలిపారు. ఈ విధంగా సింగపూర్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి మెలసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకలను టీసీఎస్‌ఎస్‌ ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, ముదం అశోక్, టీసీఎస్‌ఎస్‌ కార్యదర్శి  బసిక ప్రశాంత్తో పాటు ఇరు సంస్థల కార్యవర్గ సభ్యులు గడప రమేష్ బాబు, శివ రామ్ ప్రసాద్, మొగిలి సునీత రాజేందర్, గర్రేపల్లి శ్రీనివాస్, నల్ల భాస్కర్, దుర్గా ప్రసాద్, వినయ్, చిలుక సురేష్, ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, ఎల్లా రాం , ఆర్‌సీ రెడ్డి, సీహెచ్‌. మహేశ్, దామోదర్, భరత్లు పర్యవేక్షించారు. ఈ సంబురాలు ఇంత ఘనంగా జరగడానికి తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికి  పేరు పేరు న రెండు సంస్థల కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement