రాహుల్కి టీసీఎస్‌ఎస్‌ సభ్యుల సన్మానం | Telangana Cultural Society members meets Rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్కి టీసీఎస్‌ఎస్‌ సభ్యుల సన్మానం

Published Mon, Mar 12 2018 11:47 AM | Last Updated on Mon, Mar 12 2018 11:55 AM

Telangana Cultural Society members meets Rahul gandhi - Sakshi

సింగపూర్‌ : గ్లోబల్ లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి సింగపూర్ వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని స్థానిక మరీనా బే సాండ్స్ హోటల్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్(టీసీఎస్‌ఎస్‌) కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి టీసీఎస్‌ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. క్షణం తీరిక లేకపోయినా తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ సభ్యులకు సమయం కేటాయించినందుకు గాను సొసైటీ సభ్యులు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాహుల్ గాంధీతో సమావేశానికి  సహకరించిన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి  మధు యాష్కికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్. పి. శ్రావణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశం అనంతరం

స్థానిక సన్ టెక్ కన్వెన్షన్ కేంద్రం లో జరిగిన చర్చాగోష్టి లో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు, నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కోశాధికారి గడప రమేష్,  ప్రాంతీయ కార్యదర్శి యేళ్ల రామ్ రెడ్డి, కమిటీ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్,  గార్లపాటి లక్ష్మారెడ్డి, పింగ్లి భరత్, నల్ల భాస్కర్, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, గోనె నరేందర్, దుంతుల సుభాష్, జూలూరు సంతోష్, పట్లురి రాములు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement