
ప్రతీకాత్మక చిత్రం
జ్యోతినగర్(పెద్దపల్లి): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు మంగళవారం బైటాయించింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌కు చెందిన మానుపాటి నవీన్, భీమునిపట్నంకు చెందిన యువతి (22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఓ గుడిలో వివాహం కూడా చేసుకున్నామని బాధిత యువతి పేర్కొంది.
తర్వాత అతను దుబాయికి వెళ్లి వచ్చాక ఇంటికి తీసుకెళతానని మాట ఇచ్చాడని, తీరా ఇప్పుడు తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. ఎన్టీపీసీ పోలీసులు అక్కడకు చేరుకుని ఫిర్యాదు చేస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది.
Comments
Please login to add a commentAdd a comment