
సాక్షి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఈనెల 18 నుంచి 20వ తేదీల మధ్య ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాలలో ఎస్సీ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతోపాటు రామగుండంలో కమిషనరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే ఇందులో భాగంగానే బహిరంగ సభలను కూడా నిర్వహించి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు మరోసారి చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చదవండి: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్లు