jagtial tour
-
జగిత్యాల పర్యటన.. కొండగట్టుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నేడు అద్భుతమైన కలెక్టరేట్ నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు. జగిత్యాల జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదని, ప్రస్తుతం జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అభినందలు తెలిపారు. ఏకైక రాష్ట్ర తెలంగాణే తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. బండలింగాపూర్‌ను మండల కేంద్రం చేస్తామని పేర్కొన్నారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాషష్ట్రం తెలంగాణనే అని అన్నారు. తాను బతికున్నంత వరకూ రైతుబంధు, రైతు బీమా ఆగవని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనదని, కానీ దేశంలో ధాన్యం కొనే ఏకైక రాష్ట్ర తెలంగాణేనని చెప్పారు. ఇంకా ఎన్నో పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్ ‘మోటర్లకు మీటర్లు పెట్టాలట.. పెడదామా అని ప్రశ్నించారు. గోల్‌మాళ్ గోవిందం గాళ్లు, కారుకూతలు కూసేవాళ్లు మన మధ్య తిరుగుతున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలాగే దేశమంతా అభివృద్ధి చెందాలి. మనం వచ్చినప్పుడే కేంద్రంలో మోదీ కూడా వచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరిగిందా? మోదీ వచ్చాక ఉన్న ఆస్తులు ఊడగొడుతున్నారు. రైతులకు ఉచితాలు ఇవ్వొద్దు కానీ.. ఎన్పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్ల ప్రజా సంపదను దోచిపెట్టారు. రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీని కూడా అమ్మేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పిడికిళ్లు బిగించాలి. దేశంలో ఇప్పటికే 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. 50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయి.’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. -
పెద్దపల్లి, జగిత్యాలకు సీఎం కేసీఆర్..ఎప్పుడంటే!
సాక్షి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఈనెల 18 నుంచి 20వ తేదీల మధ్య ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాలలో ఎస్సీ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతోపాటు రామగుండంలో కమిషనరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే ఇందులో భాగంగానే బహిరంగ సభలను కూడా నిర్వహించి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు మరోసారి చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్లు -
లోకేష్ నన్ను నాన్‌లోకల్ అన్నాడు: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న లోకేష్ గతంలో తనను నాన్ లోకల్ అని, తాను మాత్రమే లోకల్ అని చెప్పాడని, ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. లోకేష్ ఏపీ కేబినెట్ లో చేరగానే ఇక్కడ టీడీపీ మూత పడిందని అర్ధమని చెప్పారు. జగిత్యాల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు చెప్పారు. తనకు ఇప్పుడే ఏదో కావాలని లేదని, రాష్ట్రానికి మరో పదేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. తన తండ్రికి 64 సంవత్సరాల వయసున్నా ఆయన ఇంకా యంగ్‌గానే ఉన్నారని చెప్పారు. మూడేళ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేశారని, మొండిగా వెళ్లే వ్యక్తే ఈ రాష్ట్రానికి కావాలని చెప్పారు. కాంగ్రెస్ అంటే ప్రజలకి మొహం మొత్తిందని, తాను మాత్రమే కాదు.. హరీష్ కూడా కేసీఆర్ నాయకత్వమే ఉండాలనుకుంటున్నారని చెప్పారు. మూడేళ్ల తమ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సబ్సిడీ ఇవ్వడమే గగనం అనే పరిస్థితి నుంచి కూడా మార్పు తెచ్చామని, ఈ విషయంలో అప్పుడప్పుడు తమకే భయంగా ఉంటోందని కేటీఆర్ అన్నారు. సంక్షేమానికి దాదాపు రూ. 40వేల కోట్ల నుంచి నుంచి 46 వేల కోట్ల వరకు ఇస్తున్నామని చెప్పారు. జనహిత సభలను ఉద్దేశ పూర్వకంగానే పెట్టడంలేదని తెలిపారు. పంచాయత రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేవాడినని, ఇప్పుడు డైరెక్ట్ పబ్లిక్ ఇంట్రాక్షన్ లేదని.. మున్సిపాలిటీ ఫోకస్‌తో ఎమ్మెల్యేలు రమ్మని పిలిస్తే ఒప్పుకున్నానని ఆయన అన్నారు. జగిత్యాలలో తాము ఓడిపోయామని, అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలనే తప్ప.. తనను సీఎం చేస్తారని ఇక్కడ సభలు పెట్టారనడం సబబు కాదని స్పష్టం చేశారు. 12 శాతం రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పా అని అడిగారు. బీజేపీ ఎన్నికల ముందు ఏం చెప్పినా జనాలకి నచ్చలేదని, అందుకే టీఆర్ఎస్ ను గెలిపించారని కేటీఆర్ అన్నారు. బీసీలకు అన్యాయం జరగబోదని, ఆరు నెలల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇస్తామని తెలిపారు. ఐదు మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు గానీ రాష్ట్రంలో పాగా వేస్తారా అని అన్నారు.