సాక్షి,ధర్మారం(పెద్దపల్లి): దొంగతుర్తి గ్రామం పోలీసులకు నెలవుగా మారింది. పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో 42 మంది యువకులు పని చేస్తున్నారు. మరో వంద మంది వరకు ఇతర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన ఈ గ్రామం నుంచి 1995లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన పాలకుర్తి మల్లేశం కాటారం మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు.
గ్రామంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి, పోలీస్‌శాఖ ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. మల్లేశంను ఆదర్శంగా తీసుకున్న గ్రామ యువత పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధిస్తోంది. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముగ్గురు ఎస్సైలుగా, 31 మంది సివిల్ కానిస్టేబుళ్లుగా, ఇద్దరు ఆర్మీలో, ఇద్దరు బీఎస్ ఎఫ్‌లో, నలుగురు సీఐఎస్‌ఎఫ్‌లో, ఒకరు సీఆర్‌పీఎఫ్‌లో పని చేస్తున్నారు.
చదవండి: Munawar Faruqui: స్టాండప్ కమెడియన్ రాకపై కాక,.. తగ్గేదెవరో.. నెగ్గేదెవరో?
Comments
Please login to add a commentAdd a comment