సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
కాగా, సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన రమేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీఈడీ చదివినా ఉద్యోగం రాలేదని మనస్థాపంతో అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు సమాచారం. సభకు కిరోసిన్ బాటిల్ తెచ్చుకుని సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకుని సభ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అయితే, బీఈడీ చదివినా తనకు ఉద్యోగం రాకపోవడం, ఇటీవలే తన తండ్రి చనిపోవడం, తన తల్లి మంచానపడటం, భార్యాపిల్లల పోషించే పరిస్థితి లేకపోవడంతో రమేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. కాగా, ఉద్యోగం విషయంలో తాను ప్రజా ప్రతినిధులతో విన్నవించుకున్నా ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: గుజరాత్ బీజేపీ దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారు: కేసీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment