
మక్కాన్‌సింగ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి, పెద్దపల్లి: ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితులకు న్యాయం చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి కోరుకంటి చందర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి మక్కాన్‌సింగ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్‌ఎఫ్ïసీఎల్ కాంట్రాక్టు కార్మికుని మృతికి నిరసనగా.. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి.
పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో తెలిపినప్పటికీ ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే కార్మికుడు హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. దీనికి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ పూర్తి బాధ్యత వహిస్తూ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment