CM KCR Serious Comments On BJP And PM Modi In Peddapalli Tour, Details Inside - Sakshi
Sakshi News home page

బీజేపీ దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు: కేసీఆర్‌ ఫైర్‌

Published Mon, Aug 29 2022 4:50 PM | Last Updated on Mon, Aug 29 2022 5:57 PM

CM KCR Serious Comments On BJP And PM Modi At Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌.. సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘భారత దేశమే ఆశ్యర్చపడే విధంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నాము. తెలంగాణ ప్రగతిపై వివిధ రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. 26 రాష్ట్రాల రైతు నాయకులు తెలంగాణ సాగు విధానంపై ఆరా తీశారు. రైతు నాయకులు నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. గాంధీ మద్యపానం నిషేధించిన గుజరాత్‌ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యానికి ఎందరో​ బలయ్యారు. దీంతో మీ సమాధానం ఏంటీ మోదీ. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో దోపిడీ తప్ప మరేమీ లేదు. ఇక్కడ ఉండే నాయకులతో చెప్పులు మోయించుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే దోపిడీ దొంగలు.. వాళ్ల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు. ఆత్మగౌరవంతో ఉందామా.. గులాంలుగా మారుదామా?. 

గుజరాత్‌ మోడల్‌ పేరుతో దేశాన్ని నాశనం చేశారు. నరేంద్ర మోదీ తీరు కారణంగా.. శ్రీలంకలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతింది. ప్రధాని మోదీ గో బ్యాక్‌ అంటూ లంకేయులు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాదు. రైతులకు మీటర్‌ పెట్టాలంటున్న మోదీకే మీటర్‌ పెడుదామం. బీజేపీ ముక్త్‌ భారత్‌ అంతా కలిసి రావాలి. 

ధాన్యం కొనమంటే కేంద్రానికి కొనడం చేతకాదు. తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గజదొంగలు, లంచగొండులు  ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేది అంతా అబద్దమే. బీజేపీని పారదోలి 2024లో రైతుల ప్రభుత్వం రాబోతోంది’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement