![Woman ASI Died In Peddapalli Road Accident - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/17/Untitled-4_0.jpg.webp?itok=LNpjd6o-)
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కమాన్‌పూర్ ఏఎస్‌ఐ భాగ్యలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పెద్దపల్లిలోని తన నివాసం నుంచి కూతురుతో కలిసి భాగ్యలక్ష్మి బస్టాండ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. భాగ్యలక్ష్మి వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ భాగ్యలక్ష్మి మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కూతురు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ రాజేశ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment