హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల వాదనలు
హైదరాబాద్: హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో తమతమ వాదనలు వినిపించాయి. హైకోర్టు విభజన తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఏపీ హైకోర్టు కోసం ప్రత్యేక భవనం కేటాయించేందుకు తాము సిద్దమేనని తెలిపింది.
హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీ, భూ సమీకరణ, ఆర్థిక వనరుల సమీకరణకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కోర్టుకు వివరించింది. భూసేకరణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.