వాదనలొవద్దు... వేదనపడొద్దు | Why do married couples argue over stupid things? | Sakshi
Sakshi News home page

వాదనలొవద్దు... వేదనపడొద్దు

Published Sun, Oct 20 2013 3:27 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

వాదనలొవద్దు... వేదనపడొద్దు

వాదనలొవద్దు... వేదనపడొద్దు

భార్యాభర్తలు దేని గురించి ఎక్కువగా వాదించుకుంటారో మీకు తెలుసా? సంసారం అంటే సీరియస్ వ్యవహారం కాబట్టి ఆషామాషీ విషయాలపై ఆలుమగలు ఆర్గ్యుమెంట్కు దిగరన్నది మీ సమాధానమైతే పొరబడినట్టే. ప్రాధాన్యం లేని చిన్నచిన్న విషయాలకే దంపతులు వాదించుకుని తగవులకు దిగుతున్నారంటే నమ్మాల్సిందే. దాంపత్యంలో గిల్లికజ్జాలు సహజమైనప్పటికీ అనవసరపు వాదనలతో ఆలుమగలు తమ కాపురాలను నిత్యనరకంగా మార్చకుంటున్నారు.

సంసారం సాగరం అనేవారు కొందరయితే, సంసారం స్వర్గసీమ అనేవారు మరి కొందరు. వివాహ జీవితంలో తమకెదురైన అనుభవాల ఆధారంగా ఈ రెండు రకాల భావాలను వ్యక్తపరుస్తుంటారు. తొలినాళ్లలో దాంపత్య జీవితం మధురంగా ఉంటుందని, రాన్రాను మొద్దుబారిపోతుందని సీనియర్ సంసారులు సెలవిస్తుంటారు. ఈ మాటెలావున్నా భార్యాభర్తల మధ్య గొడవలకు వాదనతో ప్రారంభమవుతాయని అధ్యయనకర్తలు అంటున్నారు. అదికూడా అర్థంలేని విషయాలకే ఆలుమగలు అరుచుకుంటున్నారని పేర్కొన్నారు.

టీవీలో ఏ కార్యక్రమం చూడాలి, ఫ్రిజ్లో వస్తువులు ఎక్కడ పెట్టాలి, పిల్లలను ఎలా రెడీ చేయాలి, బాత్రూమ్ను ఎవరు శుభ్రం చేయాలి, పెంపుడు కుక్కకు ఏ పేరు పెట్టాలి, తిన్నతర్వాత గిన్నెలు ఎవరు తోమాలి తదితర విషయాల్లో భార్యాభర్తలు ఎక్కువగా వాదనలు వేసుకుంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు 'అత్తగారు' మన్నింట్లో ఎన్ని రోజులుంటారనే విషయంలోనూ అధికంగానే వాదులాడుకుంటున్నారు(ట).

పండుగలు ఎవరి తరపువారింట్లో జరుపుకోవాలి, ముస్తాబుకు ఎవరెక్కువ సమయం తీసుకుంటున్నారనే దాని గురించి కూడా ఫ్యామిలీస్లో పోరాటాలు మొదలతున్నాయి. ఆఖరికి పడకగదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలనే విషయంలోనూ వాదనలు జరుగుతున్నాయి. తిండి, వంటలు విషయంలో ఒకరికొకరు వంకలు పెట్టుకోవడం ఆలుమగల మధ్య సహజంగా జరిగిపోతుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదవుతుంది.

మంచిచెడు అనేవి ప్రతి విషయంలోనూ ఉంటాయి. అర్థంలేని వాదనతో వివాహ బంధాన్ని విచ్చిన్నం చేసుకుకోవం అవివేకం. ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగకుండా సహనంతో సర్దుకుపోతే సంసారం స్వర్గసీమ అవుతుందనడంతో సందేహమేముంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement