Karimnagar Crime News Today: Beautician Missing Mystery In Karimnagar - Sakshi
Sakshi News home page

Karimnagar: బ్యూటీషియన్‌ అదృశ్యం

Published Tue, Dec 14 2021 11:45 AM | Last Updated on Tue, Dec 14 2021 12:07 PM

Beautician Missing Mystery In karimnagar - Sakshi

అక్షిత

సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్‌): ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌కు చెందిన కల్లెపల్లి అక్షిత(27) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. అక్షిత తల్లి ఎల్దండి కళావతి ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం బ్యూటీపార్లర్‌ నడుపుతూ ఉండేదన్నారు.  

సర్ది చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి
సిరిసిల్ల: తమ ఇంటి ముందు జరుగుతున్న గొడవను నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడి చేసిన వ్యక్తి సోమవారం సిరిసిల్లటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్తాబాద్‌ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లపు సునీత సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌లో నివసించే వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లింది.

అక్క కూతురు, ఆమె భర్తకు మధ్య గొడవలను సద్దుమణిచేందుకు మాట్లాడడం గురించి వచ్చింది. ఈక్రమంలోనే కుటుంబికుడైన అరవింద్‌ అకారణంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి:  మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement