భార్యాభర్తల గొడవ.. కూతురిని ఒంటరిగా తీసుకెళ్లి.. | Man Strangles Daughter After Argument With Wife Maharashtra | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల గొడవ.. కూతురిని ఒంటరిగా తీసుకెళ్లి..

Published Mon, Dec 6 2021 5:53 PM | Last Updated on Mon, Dec 6 2021 6:08 PM

Man Strangles Daughter After Argument With Wife Maharashtra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: కోపం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ సమయంలో విచక్షణ మరచి ప్రవర్తిస్తే అఘాయిత్యాలే జరుగుతాయి. తాజాగా ఓ కన్న తండ్రి కసాయిలా మారి తన కుమార్తెను పీకపిసికి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది.  నిందితుడిని థానేలోని ముంబ్రాకు చెందిన అనీష్ మల్దార్ అనే కార్మికుడిగా  పోలీసులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. థానే ప్రాంతంలో మల్దార్ తన భార్య, కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. గతకొంత కాలంగా ఆ దంపతులు ఇంట్లో చిన్నచిన్న విషయాలపై వారు తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి, ఏదో విషయమై మల్దార్‌కు తన భార్యతో గొడవ ప్రారంభమై, అది కాస్త తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో కోపం తెచ్చుకున్న సదరు వ్యక్తి.. ఏడేళ్ల తన కుమార్తెపై ఆ కోపం చూపించాడు. క్షణికావేశంలో ఆ బాలికను ఒంటరిగా బయటకు తీసుకెళ్లి పీక పిసికి చంపేశాడు. కుమార్తె మృతి గురించి అతని భార్యకు తరువాత తెలియడంతో, ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నరు.

చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement