
రాజేంద్ర
భువనేశ్వర్ : పూట గడవటం కోసం డ్రైవర్‌గా పని చేసుకునే ఓ వ్యక్తికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేశావంటూ నోటీసులు పంపించారు. ఒడిస్సాలోని రూర్కేలాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రూర్కేలాకు చెందిన రాజేంద్ర పల్లై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం కటక్, జీఎస్టీ ఆఫీసునుంచి అతడికి ఏవో నోటీసులు వచ్చాయి. ‘‘ రాజేంద్ర.. ఆర్పీ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి యజమాని. ఆ కంపెనీ పేరిట 4.31 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి. (అమ్మ ఉద్యోగం పోయింది,14 ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే...)
అది కూడా నకిలీ కంపెనీ పేరిట, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి పన్ను ఎగవేశావు’’ అని నోటీసులో ఉంది. దీంతో రాజేంద్ర అయోమయానికి గురయ్యాడు. తన ఐడెంటిటీని ఎవరో దొంగిలించారని అతనికి అర్థం అయింది. దీనిపై అతడు మాట్లాడుతూ..‘‘ కొద్దిరోజల క్రితం ఓ వ్యక్తి నాకు 10 వేల రూపాయలు వచ్చే జీతం ఇప్పిస్తానని చెప్పి, నా వద్దనుంచి ఆధార్ కార్డు ఇతర పత్రాలు తీసుకున్నాడు. సదరు పత్రాల ఆధారంగా నా పేరిట నకిలీ కంపెనీ సృష్టించారని తెలిసింది. అధికారులు దీనిపై విచారణ జరపాలని కోరుకుంటున్నా’’నన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment