
విశ్వేశ్వతీర్థ స్వామీజీ డ్రైవర్ మహ్మద్ ఆరీఫ్
కర్ణాటక, బొమ్మనహళ్లి: ఉడుపి శ్రీకృష్ణమఠాధిపది శ్రీ విశ్వేశతీర్థ స్వామి పేరు వినగానే గుర్తుకువచ్చేది ఆయన హిందుత్వ వాది అని. అయితే ఆయన కారు డ్రైవర్ మాత్రం ఒక ముస్లిం యువకుడిని నియమించుకున్నారు. దీంతో అనేకులు స్వామీజీపై అభ్యంతర వ్యక్తం చేశారు. అయితే ఏ ఒక్కరి మాటలను స్వామీజీ పట్టించుకోలేదు. నాకు కారు డ్రైవర్ కావాలి తప్ప ఆయన ఏ మతస్తుడు అనేది తనకు అవసరం లేదని చెప్పేవారు. ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ... స్వామీజీ వద్ద తనతో పాటు, తమ కుటుంబానికి చెందిన మొత్తం ముగ్గురు ఇక్కడ డ్రైవర్లగా పనిచేశామన్నారు. తన ఇద్దరి సోదరుల తరువాత తాను ఏడాదిన్నరగా స్వామీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.
పేజావర స్వామిజీని హిందుత్వ వాది అంటారని, అయితే స్వామిజీ మనసులో అటువంటి భావాలు ఉండవన్నారు. పైగా తన వద్ద పనిచేయడం కష్టంగా ఉందా అని స్వామీజీ అడిగేవారని ఆరిఫ్ అన్నారు. తనకు మఠంలో ఎటువంటి ఆంక్షలు కూడా పెట్టేవారు కాదని, పైగా నమాజ్ కూడా చేసుకోమని స్వామీజీ చెప్పేవారని అన్నారు. స్వామీజీ భగవద్గీతతో పాటు ఖురాన్ కూడా చదివేవారని అందులో మంచి మాటలు తనకు వివరించేవారని ఆరిఫ్ గుర్తు చేసుకున్నారు. ముస్లిం పండుగల సమయంలో అనేక మందికి స్వామీజీ సహాయం చేసేవారని, తనకు కూడా ఎన్నోమార్లు సహాయం కావాలా అని అడిగేవారని అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన మహానుభావుడు స్వామీజీ అని ఆరిఫ్ గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment