
బీజింగ్: రోడ్డు మీద ఏమైనా పట్టించుకోని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలే సాయంత్రం.. త్వరగా ఇంటికెళ్లాలనే ఆతృత. ఆ హడావిడిలో ట్రాఫిక్ రూల్స్‌ను తుంగలో తొక్కేయడం సహజమే. ఇలాంటి ఘటనే మన పొరుగు దేశం చైనాలో చోటుచేసుకుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఓ కారు డ్రైవర్ చేసిన పని.. అతన్ని సోషల్ మీడియాలో హీరోను చేసింది. ఇంతకి విషయమేమిటంటే.. సిగ్నల్ కూడలి వద్ద ఉన్న జిబ్రా క్రాసింగ్‌ను దాటడానికి ఓ ముసులవ్వ శతవిధాల ప్రయత్నిస్తోంది.
కానీ ఉరుకుల పరుగుల జీవితం కదా.. ఎవ్వడేమైపోతే మనకేందుకు.. అన్నట్లు వెళ్తున్నారు వాహనాదారులు. ఇంతలో అక్కడికి వచ్చిన పసుపు రంగు కారు మాత్రం ఆ ఆముసలవ్వనే చూస్తున్నట్లు ఆగింది. ఎంతకీ ఇతర వాహనాలు ఆగకపోవడంతో చిరాకెత్తిన ఆ డ్రైవర్ కారు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌ను అడ్డుకున్నాడు. దీంతో ఆ ముసలవ్వ రోడ్డు దాటింది. రెండు రోజుల క్రితం చైనా జినుహా కూడలి కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి ‘పరిమళించిన మానవత్వానికి సెల్యూట్’ అంటూ షేర్ చేశాడు. ఇంకేముంది ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ డ్రైవర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.!
Comments
Please login to add a commentAdd a comment