
తమిళనాడు,తిరువొత్తియూరు : ఇద్దరు పిల్లలను అనాథగా వదలి ప్రియుడితో పారిపోయిన సంగీత, నృత్య ఉపాధ్యాయురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా తిరువట్టార్ సమీపంలో ఓ గ్రామానికి చెందిన అరుణ్ (30) ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా ఉన్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న (35) సంగీత, నృత్య ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఆమె భర్త విదేశాలలో ఉంటున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియుడితో ఉల్లాసంగా తిరుగుతున్నట్టు తెలిసింది. ఆమె బంధువులు మందలించడంతో ఇద్దరు పిల్లలను వదలి గత జూలైలో ప్రియుడితో పారిపోయింది. పోలీసులు విచారణ చేపట్టారు. కన్యాకుమారిలో దాగి ఉన్న వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ పిల్లలను వదిలిపెట్టి వారిద్దరూ పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
Comments
Please login to add a commentAdd a comment