Dance teacher
-
డ్యాన్స్ స్కూల్: కొవ్వు తగ్గిస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి..
సాక్షి, కంటోన్మెంట్: డ్యాన్స్ స్కూల్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించిన వివరాల మేరకు తిరులమగిరి దుర్గావిహార్ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అర్బన్ డ్యాన్స్ వరల్డ్‌లో మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంబంధిత డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడు సుదర్శన్ బాలిక నడుము వద్ద కొవ్వును తగ్గిస్తానని, అందుకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8గంటల సెషన్లో వర్కవుట్స్‌కు రావాల్సిందిగా సూచించాడు. దీంతో బాలిక గత నెల 26 నుంచి ఉదయం వేళలో వర్కవుట్స్‌కు వెళ్తోంది. తను ఇచ్చే శిక్షణకు సంబంధించి ఇన్‌స్ట్రాగామ్ రీల్ చేయాల్సి ఉంటుందని బాలికకు సూచించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వర్కవుట్స్ సమయంలో డ్యాన్స్ స్కూల్‌కు వచి్చన బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు బాలిక ఇంట్లో వాళ్లకు విషయం తెలుపగా డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి.. -
వినోద్ కోసం ‘మహా’ పోలీసుల వేట!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన డ్యాన్స్ మాస్టర్‌ను డ్రగ్ పెడ్లర్‌గా మార్చిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న వినోద్ కోసం మహారాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇతడి మాజీ సహోద్యోగి అయిన కూకట్పల్లి వాసి శివశంకర్‌ను నాగ్‌పూర్‌లోని బెల్ట్రారోడి పోలీసులు గత వారం అరెస్టు చేశారు. ఇతడి విచారణలోనే నగరానికి చెందిన వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ నుంచి ఓ ప్రత్యేక బృందం సిటీకి చేరుకుని గాలింపు చేపట్టింది. వరంగల్‌కు చెందిన ఇసాంపల్లి శివశంకర్ భార్య ఇద్దరు పిల్లలతో కూకట్పల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో నివసిస్తూ అక్కడి ఓ ప్రముఖ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా చేరాడు. అయితే గత ఏడాది లాక్డౌన్ ఎఫెక్ట్ ఇతడిపై పడింది. పాఠశాల మూతపడటంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న ఇతగాడికి తన మాజీ సహోద్యోగి వినోద్ తారసపడ్డాడు. తాను మరికొందరితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నానంటూ చెప్పిన వినోద్ సహకరించాలని కోరాడు. దీనికి శివశంకర్ అంగీకరించడంతో తాము గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నింపిన కారు అందిస్తామని, దాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి రిసీవర్లకు ఇచ్చి రావాలంటూ వినోద్ చెప్పాడు. ట్రిప్పుకు రూ.10 వేలు చెల్లిస్తాననటంతో శివశంకర్ అంగీకరించాడు.ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న పంజారి ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డాడు. ఆ ప్రాంతంలో రాత్రి వేళ లాక్డౌన్ అమలులో ఉండటంతో బెల్ట్రారోడి పోలీసులు వివిధ ప్రాంతాల్లో నాకాబందీలు ఏర్పాటు చేశారు. ఓ పికెట్‌లో ఉన్న పోలీసులను చూసిన శివశంకర్ కారును వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు. అదుపులోకి తీసుకొని రూ.13.73 లక్షల విలువైన 91 కేజీల గంజాయి, గుర్తు తెలియని మాదకద్రవ్యాలు వెలుగులోకి వచ్చాయి. శివశంకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో బెల్ట్రారోడి పోలీసులకు చెందిన బృందం నగరానికి చేరుకుని గాలిస్తోంది. ఈ వ్యవహారం వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. శివశంకర్ నడిపిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ తరచు నగరానికి వచ్చివెళ్లడమో, ఇక్కడి వారి వద్దే ఉండటమో జరిగిందని భావిస్తున్నారు. గత నెల 11న ఈ వాహనం రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లో వెళ్తుండగా మేడ్చెల్ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీసు కెమెరాకు చిక్కింది. ఈ నేపథ్యంలోనే దీనిపై అధికారులు రూ.1100 జరిమానా కూడా విధించారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు వినోద్ లేదా ఆ ముఠాకు చెందిన మరో వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని అనుమానిస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న ‘గసగసాల’ నిందితుల అరెస్టులు -
డ్రైవర్‌తో టీచర్ పరార్
తమిళనాడు,తిరువొత్తియూరు : ఇద్దరు పిల్లలను అనాథగా వదలి ప్రియుడితో పారిపోయిన సంగీత, నృత్య ఉపాధ్యాయురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా తిరువట్టార్ సమీపంలో ఓ గ్రామానికి చెందిన అరుణ్ (30) ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా ఉన్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న (35) సంగీత, నృత్య ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్త విదేశాలలో ఉంటున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియుడితో ఉల్లాసంగా తిరుగుతున్నట్టు తెలిసింది. ఆమె బంధువులు మందలించడంతో ఇద్దరు పిల్లలను వదలి గత జూలైలో ప్రియుడితో పారిపోయింది. పోలీసులు విచారణ చేపట్టారు. కన్యాకుమారిలో దాగి ఉన్న వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ పిల్లలను వదిలిపెట్టి వారిద్దరూ పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. -
మైనర్‌కు హెచ్ఐవీ: డ్యాన్స్ టీచరే కారణం
వాషింగ్టన్: ‘బ్రింగ్ ఇట్’ డ్యాన్స్ షోలో పాల్గొన్న ఓ డ్యాన్స్ టీచర్ చేసిన అసహజమైన చర్యకు జైలు పాలయ్యాడు. షెల్బీ దేశానికి చెందిన జాన్ కాన్నర్‌కు 2015లో సోషల్ మీడియాలో టీనేజర్ పరిచయమయ్యాడు. దీంతో జాన్నర్ ... తన బ్రింగ్ ఇట్ డ్యాన్స్ బృందంలోకి అతడిని తీసుకున్నాడు. ఇక వీరిద్దరూ టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకుంటూ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో న్యూడ్ ఫొటోలు కూడా షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కాన్నర్ తన కారులోని వెనకసీట్లో టీనేజర్‌పై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే జాన్నర్కు హెచ్ఐవీ ఉందన్న విషయం టీజనేర్కు ఆలస్యంగా తెలిసింది. దీంతో భయపడిన అతడు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించాడు. వెంటనే బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి హెచ్ఐవీ సోకిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు సమాచారమివ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. 2012లోనే కాన్నర్ హెచ్ఐవీ బారినపడినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి టీనేజర్‌పై అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇదే తరహాలో అతనిపై రెండు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా వీటికి సంబంధించిన విచారణ ఈ వారంలో ప్రారంభం కానుంది. -
మూడో తరగతి విద్యార్థినిపై డాన్స్ టీచర్ లైంగిక దాడి
-
రేప్ కేసులో డ్యాన్స్‌మాస్టర్ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటకలో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన డ్యాన్స్‌మాస్టర్‌ను సోమవారం బాణసవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... బాణసవాడికి చెందిన డ్యాన్స్ మాస్టర్ క్రిస్టోఫర్ వద్దకు ఓ యువతి (23) డ్యాన్స్ నేర్చుకోవడానికి 2014లో స్కూల్లో చేరింది. ఈ సమయంలో డ్యాన్స్‌మాస్టర్ వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించి ప్రేమలోకి దింపాడు. కొద్దిరోజులుగా ఆమెను తప్పించుకుని తిరుగుతున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బాణసవాడి పోలీసులు క్రిస్టోఫర్ ను అరెస్ట్ చేశారు. -
ప్రేయసిని చంపి.. డాన్స్ టీచర్ ఆత్మహత్య
దక్షిణ ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డాన్స్ టీచర్‌గా పనిచేసే ఓ యువకుడు తన ప్రేయసి పీకకు కరెంటు వైరు చుట్టి చంపేసి, తర్వాత సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండోర్‌కు చెందిన సోను ఢిల్లీలో డాన్స్ స్కూలు నడుపుతుంటాడు. అక్కడ డాన్స్ నేర్చుకోడానికి వచ్చిన యోగితతో అతడు ప్రేమలో పడ్డాడు. తర్వాత కొన్నాళ్లకు ఆమె వేరే మగాళ్లతో మాట్లాడుతుంటే వద్దని చెప్పాడు. దాంతో ఇద్దరికీ గొడవ అయ్యింది. ఆమెకు వేరేవాళ్లతో సంబంధం ఉందని సోను అనుమానించినట్లు ఇద్దరి స్నేహితుల ప్రకటనల ఆధారంగా పోలీసులు తెలిపారు. అతడు రెండు రోజుల ముందుగానే హత్య - ఆత్మహత్యలకు ప్లాన్ వేశాడు. ముందుగా ఓ కరెంటు వైరు తీసుకొచ్చి, క్లాసు సమయం కూడా మార్చాడు. రెండు రోజుల క్రితం తన వాట్సప్ స్టేటస్‌ను కూడా ‘నేను మరో తప్పు చేశాను’ అని మార్చాడు. చెప్పడానికి ఎవరూ లేకపోయినా డాన్స్ మాత్రం మానొద్దని విద్యార్థులకు చెప్పాడు. మర్నాటి ఉదయం అకాడమీని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చినపుడు ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆమె పీకకు కరెంటువైరు బిగించి చంపి, ఆమె దుపట్టాతోనే ఉరేసుకున్నాడని, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపామని పోలీసులు తెలిపారు. -
సింహళ మయూరం
గౌతమిలో తెలుగుదనం ఉట్టిపడడానికి రెండు కారణాలు. ఒకటి ఆమె పేరు. ఇంకొకటి ఆమె అభిరుచి. శ్రీలంకకు చెందిన ఈ సింహళ జాతీయురాలికి కూచిపూడిలో చక్కటి ప్రావీణ్యం ఉందని చెప్పడం కన్నా, కూచిపూడి అంటే ఆమెకు ప్రాణం అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఆమెకు మన భాష తెలీదు. మన భావం తెలీదు. అయినప్పటికీ కీర్తనలను అర్థం చేసుకుంటూ కూచిపూడిని అభినయిస్తున్నారు. ప్రశంసలూ అందుకుంటున్నారు. భర్త ఉద్యోగరీత్యా రెండేళ్లుగా విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఉంటున్న గౌతమి ఇటీవలే శ్రీలంకలో కూడా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి వచ్చారు. గౌతమి పూర్తి పేరు గౌతమి నిరంజల గమాగే. శ్రీలంకలో ఫైన్ఆర్ట్స్లో డిగ్రీ చేశారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా ఉన్నారు. పదేళ్ల క్రితం టీవీలో ఎవరిదో కూచిపూడి ప్రదర్శన చూసి ఆమె ఆ నాట్యం వైపు ఆకర్షితురాలయ్యారు. నృత్య భంగిమలు, అభినయమే గాక అందులోని అలంకరణ కూడా ఆ ఆకర్షణకు ఒక కారణమని గౌతమి అంటారు. గౌతమి భర్త కపిల్ సంజీవర్ ఒక కంపెనీలో ఉన్నతోద్యోగి. ‘‘మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి. అబ్బాయి. వైజాగ్ ప్రకృతి అందంతో పాటు ఇక్కడి మనుషుల ఆత్మీయత నాకెంతో నచ్చింది. ఇక్కడికొచ్చిన రెండు నెలల్లోనే సాయినాథ కళాసమితిలో కూచిపూడి శిక్షణకు చేరా. వీకెండ్స్‌ని పూర్తిగా కూచిపూడి నేర్చుకోవడానికి కేటాయించా. నాట్యాచార్యులైన అరుణ్ సాయికుమార్, పేరిణికుమారి దంపతులు సంకీర్తనల్లో భావాన్ని ఇంగ్లిషులో వివరిస్తూ నాకు కూచిపూడి నేర్పించారు. అలా నేర్చుకునే వైజాగ్‌లోని దేవాలయాల్లో ఇప్పటి వరకు పది ప్రదర్శనలు ఇచ్చా. అందరూ నన్ను ప్రశంసిస్తూ ఉంటే ఆ ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంత స్పందన వస్తుందని నేను ఊహించలేదు’’ అని చెప్పారు గౌతమి. అంతేకాదు, తన స్వదేశం తిరిగివెళ్లిన తర్వాత పూర్తి సమయాన్ని కూచిపూడి శిక్షణ ఇవ్వడానికే వినియోగించే ఉద్దేశంలో ఉన్నారామె. ‘‘దీన్నో దైవకార్యంగా భావిస్తా. మా అమ్మాయి రసంధికీ కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నా. ఆమెను అంతర్జాతీయ స్థాయి నృత్యకారిణిగా చూడాలనేది నా కోరిక’’’ అని గౌతమి అంటున్నారు. - అల్లు సూరిబాబు, సాక్షి, విశాఖపట్నం