
వాషింగ్టన్: ‘బ్రింగ్ ఇట్’ డ్యాన్స్ షోలో పాల్గొన్న ఓ డ్యాన్స్ టీచర్ చేసిన అసహజమైన చర్యకు జైలు పాలయ్యాడు. షెల్బీ దేశానికి చెందిన జాన్ కాన్నర్‌కు 2015లో సోషల్ మీడియాలో టీనేజర్ పరిచయమయ్యాడు. దీంతో జాన్నర్ ... తన బ్రింగ్ ఇట్ డ్యాన్స్ బృందంలోకి అతడిని తీసుకున్నాడు. ఇక వీరిద్దరూ టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకుంటూ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో న్యూడ్ ఫొటోలు కూడా షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కాన్నర్ తన కారులోని వెనకసీట్లో టీనేజర్‌పై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
అయితే జాన్నర్‌కు హెచ్‌ఐవీ ఉందన్న విషయం టీజనేర్‌కు ఆలస్యంగా తెలిసింది. దీంతో భయపడిన అతడు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించాడు. వెంటనే బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి హెచ్‌ఐవీ సోకిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు సమాచారమివ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. 2012లోనే కాన్నర్ హెచ్‌ఐవీ బారినపడినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి టీనేజర్‌పై అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇదే తరహాలో అతనిపై రెండు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా వీటికి సంబంధించిన విచారణ ఈ వారంలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment