
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న రామకృష్ణారెడ్డి
సాక్షి, కర్నూలు : కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి నగదును కారు డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. హైదరాబాద్ నుంచి రాజంపేటకు వెళ్తున్న రామకృష్ణారెడ్డి కర్నూలులోని రాజ్‌విహార్ హోటళ్లో భోజనం కోసం ఆగారు. కారులో ఉన్న రూ.50 లక్షల నగదుకు డ్రైవర్ మల్లిఖార్జునను కాపలాగా ఉంచి భోజనానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి భోజనం చేసి వచ్చేలోగా కారులో ఉన్న సొమ్ముతో డ్రైవర్ మల్లికార్జున పరారయ్యాడు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment