Ramakrisha reddy
-
పురం’పై వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి
హిందూపురం: ‘చౌళూరు రామకృష్ణారెడ్డికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని గౌరవం. జగనన్న అంటే అపార అభిమానం. అందుకే కెనడాలో చదువుకున్న ఆయన, మంచి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా కట్టి పార్టీకి పునాదులు వేశారు. పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నదే ఆయన ఆశయం. అందువల్ల కార్యకర్తలంతా కలిసి 2024లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి ఆయనకు ఆత్మకుశాంతి కలిగించాలి’ అని చౌళూరు సతీమణి జ్యోత్స్న, సోదరి మధుమతి, బావ నాగభూషణంరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం హిందూపురంలోని ఈడిగ ఫంక్షన్‌హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి సంతాపసభ జరిగింది. ముందుగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి కుటుంబీకులతో పాటు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులరి్పంచి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రామకృష్ణారెడ్డి సతీమణి, సోదరి, ఇతర కుటుంబీకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఉందన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి శిక్షపడాలన్నారు. ఐక్యంగా పోరాడదాం.. చౌళూరు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయని ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ అన్నారు. ఆయన ఇంటి ముందే చౌళూరును దారుణంగా హత్య చేశారంటే, హంతకుల వెనుక ఎవరో పెద్దలున్నారనిపిస్తోందన్నారు. హత్య కేసులోని అనుమానితుల్లో కొందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రామకృష్ణారెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసం కష్టపడ్డారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇకపై పిడికిలి బిగించి అందరం ఒక్కటై రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పుడే రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి, నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రత్నమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ కొండూరు మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, రామచంద్రా, షాజియా, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొటిపి హనుమంతరెడ్డి, నాగరాజు, హబీబ్, చంద్ర, మహేశ్, దాదు, నక్కలపల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (చదవండి: చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ) -
టాలీవుడ్లో విషాదం, ప్రముఖ నిర్మాత కన్నుమూత
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి(76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామకృష్ణారెడ్డి 1948 మార్చి 8న నెల్లూరు జిల్లాలోని గూడూరులో జన్మించారు. శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామిరెడ్డి వారి తల్లిదండ్రులు. చదువు పూర్తయ్యాక కొంతకాలం సిమెంట్ రేకుల వ్యాపారాన్ని చూసుకున్న ఆయన తన బంధువు ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలా.. వైకుంఠపాళి, అల్లుడుగారు జిందాబాద్, గడుసు పిల్లోడు, మా ఊరి దేవత, అభిమానవంతులు, మూడిళ్ల ముచ్చట, సీతాపతి, అగ్ని కెరటాలు, మాయగాడు వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అమ్మోరు తల్లి చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. చదవండి 👇 గ్రాండ్‌గా కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ కిచ్చా సుదీప్, జాక్వెలిన్‌ల 'రారా రక్కమ్మా..' సాంగ్ విన్నారా? -
ఎమ్మెల్యే తండ్రి వాహనంలో రూ. 50 లక్షలు చోరీ
సాక్షి, కర్నూలు : కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి నగదును కారు డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. హైదరాబాద్ నుంచి రాజంపేటకు వెళ్తున్న రామకృష్ణారెడ్డి కర్నూలులోని రాజ్‌విహార్ హోటళ్లో భోజనం కోసం ఆగారు. కారులో ఉన్న రూ.50 లక్షల నగదుకు డ్రైవర్ మల్లిఖార్జునను కాపలాగా ఉంచి భోజనానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి భోజనం చేసి వచ్చేలోగా కారులో ఉన్న సొమ్ముతో డ్రైవర్ మల్లికార్జున పరారయ్యాడు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆ బిడ్డకు ఏం కష్టమొచ్చిందో..
రాజంపేట, న్యూస్‌లైన్ : ఆ చిన్నారికి ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ బలవన్మరణానికి పాల్పడింది. తను ఉండే గది కిటికీకి ఓణీతో ఉరేసుకుని తనువు చాలించింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. శనివారం తెలవారుజామున జరిగిన ఈ సంఘటనతో రాజంపేట మండలం నరనరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లెకు చెందిన హేమలత, రామకృష్ణారెడ్డి(ఈయన మైదుకూరులో ట్రాన్స్‌కో శాఖ లైన్మెన్గా పని చేస్తున్నారు) దంపతుల కుమార్తె అయిన జి.శ్రీనిధి అలియాస్ సన్ని(13)జవహర్ నవోదయ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుర్తించింది ఇలా... శుక్రవారమంతా తోటి స్నేహితులతో సరాదాగా గడిపిన శ్రీనిధి రాత్రి అందరితో పాటు నిద్రపోయింది. అయితే శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు విద్యార్థినులందరూ పీఈటీ క్లాస్‌కు వెళ్లడం దినచర్య. యథాప్రకారం విద్యార్థినులందరూ క్లాస్‌కు వెళ్లగా వారిలో ఒకరు తక్కువగా ఉన్నారు. శ్రీనిధి రాలేదని తెలుసుకుని ఆ అమ్మాయి కోసం తోటి విద్యార్థులను పిల్చుకురమ్మని పంపారు. అయితే ఆమె కన్పించలేదు. అదే విషయం ఉపాధ్యాయులకు తెలుపగా, వారొచ్చి గదంతా పరిశీలించారు. స్టోర్ రూపంలో గోడకు ఓ వైపున ఆనుకుని నిద్రపోతున్నట్లుగా కన్పించింది. నిద్రపోతోందేమోనని భావించి ఆమెను లేపేందుకు ప్రయత్నించే క్రమంలో ఓణీతో కిటికీకి ఉరేసుకుని ఉండడాన్ని గుర్తించి హడలెత్తిపోయారు. వెంటనే ఆమెను కదిపి చూడగా ఎటువంటి కదలికలు లేవు. అప్పటికే మరణించినట్లు గుర్తించి వెంటనే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కేవీఎస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పండుగకు వచ్చిందే చివరిసారి.. పండుగకు స్వగ్రామానికి వచ్చిన శ్రీనిధి కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపింది. పండుగ తరువాత తండ్రితో కలసి పాఠశాలకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. అంతలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై నవోదయ ప్రిన్సిపాల్ పోలసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు శ్రీనిధి రాసి ఉంచిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కదిలొచ్చిన యంత్రాంగం నవోదయ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, డీఈఓ అంజయ్య, స్థానిక తహశీల్దార్ చండ్రాయుడు వెంటనే విద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు.