
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రుక్షర
కట్టంగూర్ (నకిరేకల్) : రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ముత్యాలమ్మగూడెం పరిధి మాణిక్కాలమ్మగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన ఫిరంగి దుర్రాప్రసాద్ తన తండ్రి శోభనాద్రి, కుటుంబసభ్యులతో కలిసి బెంగుళూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.
మార్గమధ్యంలోని మాణిక్కామ్మగూడెం వద్దకు రాగానే దుర్గాప్రసాద్ కారును అతివేగంగా నడుపుతూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారుపల్టీ కొట్టగా దుర్గాప్రసాద్ కూతురు రుక్షర(3) తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందినది. చిన్నారి తాతయ్య మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంజిత్ తెలిపారు. చిన్నారి మృతి చెందడంలో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment