
బ్రసెల్స్: గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ మంగళవారం ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా నిజానికి నిఘా అధికారులని ఆరోపించింది.
(చదవండి: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ స్టార్ట్! ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపు, రద్దు తప్పదా?)