Emphasis
-
రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ
బ్రసెల్స్: గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ మంగళవారం ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా నిజానికి నిఘా అధికారులని ఆరోపించింది. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ స్టార్ట్! ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపు, రద్దు తప్పదా?) -
నిమిషంలో డాక్టర్ కన్సల్టేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరుకు చెందిన హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ ఎంఫైన్ వినూత్న సేవలను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమంటే నిమిషంలోపే వీడియో కాల్లో ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులను సంప్రతించవచ్చు. ఇప్పటి వరకు ఈ సంస్థ బెంగళూరులో 30 ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుని వైద్య సేవలను అందించింది. తాజాగా హైదరాబాద్‌లో కిమ్స్, సన్‌షైన్, కిమ్స్ బీబీ, మ్యాక్స్‌క్యూర్ సుయోష, ఏస్టర్ ప్రైమ్ ఆసుపత్రులతో చేతులు కలిపి ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఇలా పనిచేస్తుంది.. ఎంఫైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక కన్సల్టేషన్‌కు రూ.500 ఆన్లైన్లోనే చెల్లించాలి. సమస్య టైప్ చేయగానే అందుబాటులో ఉన్న స్పెషలిస్టులు స్క్రీన్‌పై కనపడతారు. వైద్యుడితో చాట్ చేయవచ్చు. వీడియో కాల్ ద్వారా సంప్రదించవచ్చు. సమస్య ఆధారంగా వైద్యులు మందులను సిఫారసు చేస్తారు. ప్రిస్క్రిప్షన్ యాప్‌లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 15 స్పెషాలిటీలకుగాను 100 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. పరిచయ ఆఫర్లో భాగంగా రూ.1,999లకు ఆరు నెలల వాలిడిటీతో అపరిమిత కన్సల్టేషన్‌ను అందిస్తోంది. రెండేళ్లలో 200 ఆసుపత్రులు.. ఈ–కామర్స్ కంపెనీ మింత్రా సహ వ్యవస్థాపకుడు అశుతోష్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రసాద్ కొంపల్లి ఎంఫైన్‌ను ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బందిలో 20 మంది వైద్యులే. భారత్‌లో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్ ఉందని ఎంఫైన్ సహ వ్యవస్థాపకులు ప్రసాద్ గురువారమిక్కడ మీడి యాకు తెలిపారు. ‘ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసే వైద్య నిపుణుడిని నిమిషాల్లో సంప్రదించేందుకు ఈ యాప్ దోహదం చేస్తుంది. రెండేళ్లలో 200 ఆసుపత్రులతో భాగస్వామ్యం చేసుకోవాలన్నది లక్ష్యం. తద్వారా 25 స్పెషాలిటీలు, 1,500 మంది వైద్యుల స్థాయికి చేరతాం. 10 నగరాలకు విస్తరించడం ద్వారా 5 లక్షల మందికి సేవలు అందించాలన్నది ఆశయం’ అని వివరించారు. -
ఎంఫసిస్ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం
1.73కోట్ల షేర్ల బైబ్యాక్ @రూ.1,103 కోట్లు న్యూఢిల్లీ: ఎంఫసిస్ సంస్థ షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. 1.73 కోట్ల షేర్లను (8.26% వాటా) బైబ్యాక్ చేయడానికి తమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపినట్లు సంస్థ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఒక్కో షేర్‌ను రూ.635 ధరకు మించకుండా బైబ్యాక్ చేస్తామని, ఈ బైబ్యాక్ విలువ రూ.1,103 కోట్లని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌కు 60.42% వాటా ఉంది. ప్రజల వద్ద 39.58% వాటా ఉంది. గత శుక్రవారం బీఎస్ఈలో ఈ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ.573 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీలో మెజారిటీ వాటా పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ చేతిలో ఉంది. -
హైదరాబాద్‌లో ఎంఫసిస్ కేంద్రం
ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల రంగంలో ఉన్న ఎంఫసిస్ హైదరాబాద్‌లో కాగ్నిటివ్ హబ్‌ను ప్రారంభించింది. ఆర్థిక సేవల రంగ కంపెనీలకు ఈ కేంద్రం తదుపరి తరం గవర్నెన్స్, రిస్క్, కాంప్లియాన్స్ పరిష్కారాలను అందిస్తుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. 250 సీట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు కంపెనీ సీఈవో గణేష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. -
బ్లాక్ స్టోన్ చేతికి ఎంఫసిస్
♦ మెజారిటీ వాటా కొనుగోలుకు ఒప్పందం.. ♦ 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ కూడా... ♦ డీల్ మొత్తం విలువ రూ.7,071 కోట్ల వరకూ ఉండే అవకాశం ♦ దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ డీల్‌గా రికార్డు ముంబై: దేశీ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చేజిక్కించుకోనుంది. ప్రస్తుతం ఎంఫసిస్‌లో మెజారిటీ వాటాదారుగా ఉన్న హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్(హెచ్‌పీఈ) నుంచి 60.5 శాతం పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం బ్లాక్‌స్టోన్ ప్రకటించింది. ఇందుకోసం ఒక్కోషేరుకి రూ. 430 చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటాను ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనడానికి వీలుగా ఓపెన్ ఆఫర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి షేరు ధర రూ.457.5గా ఉంటుందని బ్లాక్‌స్టోన్ పేర్కొంది. ఓపెన్ ఆఫర్‌ను సబ్స్క్రయిబ్ అయ్యేదాన్నిబట్టి చూస్తే.. బ్లాక్ స్టోన్ ఈ కొనుగోలు కోసం రూ.5,466 కోట్ల నుంచి రూ.7,071 కోట్ల వరకూ వెచ్చించనుంది. దేశీయంగా చూస్తే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ(పీఈ) డీల్‌గా ఇది రికార్డుకెక్కనుంది. హెచ్‌పీ నుంచి భారీ కాంట్రాక్టు... ఒప్పందంలో భాగంగా ఎంఫసిస్... హెచ్‌పీ నుంచి 11 ఏళ్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు బ్లాక్‌స్టోన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్ అమిత్ దీక్షిత్ కాన్ఫరెన్స్ కాల్లో విలేకరులకు తెలిపారు. వచ్చే ఐదేళ్లపాటు ఎంఫసిస్ నుంచి 90 కోట్ల డాలర్ల విలువైన (దాదాపు రూ.6,000 కోట్లు) ఐటీ సేవలను హెచ్‌పీ పొందనుందని వెల్లడించారు. విలువ రూ. 82.5 కోట్ల డాలర్లు డీల్ ప్రకారం తమ వాటా విలువ 82.5 కోట్ల డాలర్లుగా ఉంటుందని హెచ్‌పీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీతో తమ వాణిజ్య బంధంపై ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపబోదని కూడా తెలిపింది. టాప్ మేనేజ్మెంట్లో మార్పులుండవు... బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మధ్యస్థాయి ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను దక్కించుకోవడం కోసం దేశీ ఐటీ సేవల దిగ్గజం టెక్మహీంద్రాతో పాటు ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కూడా రేసులో పోటీపడ్డాయి. చివరకు బ్లాక్‌స్టోన్ చేతికి చిక్కింది. గడిచిన దశాబ్ద కాలంలో బ్లాక్‌స్టోన్ భారత్‌లోని పీఈ డీల్స్, రియల్టీ లావాదేవీల్లో 6 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించింది. ఐటీ పరిశ్రమ వృద్ధి అవకాశాలు చాలా బాగున్నాయని దీక్షిత్ అంటూ అందుకే ఇప్పుడు ఎంఫసిస్‌తో కలిపి మూడు కంపెనీల్లో(మిగతా రెండూ బీపీఓ సంస్థ ఇంటెలినెట్, ఐబీఎస్ సాఫ్ట్వేర్) మొత్తం 1.4 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టామని చెప్పారు. ఎంఫసిస్కు ఇప్పుడున్న నాయకత్వ బృందమే అతిపెద్ద బలమని.. టాప్ మేనేజ్మెంట్ను యథాతథంగా కొనసాగించనున్నట్లు దీక్షిత్ వెల్లడించారు. ఎంఫసిస్ సంగతిదీ... ♦ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఎంఫసిస్ కార్పొరేషన్‌ను తొలుత అమెరికాలో శాంటా మోనికా, జెర్రీ రావు, జెరోన్ టాస్ అనే ముగ్గురు కలసి 1998లో స్థాపించారు. ♦ 1992లో ఏర్పాటైన భారతీయ ఐటీ సేవల కంపెనీ బీఎఫ్ఎల్ సాఫ్ట్‌వేర్‌ను 2000 సంవత్సరంలో విలీనం చేసుకోవడం ద్వారా ఇప్పుడున్న ఎంఫసిస్ ఆవిర్భవించింది. ♦ 2006లో ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్ 42 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అనుబంధ సంస్థగా మార్చింది. ♦ 2008లో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ ఈడీఎస్ నుంచి ఎంఫసిస్‌ను చేజిక్కించుకుంది. ♦ దేశంలో ఏడో పెద్ద ఐటీ కంపెనీగా ఎంఫసిస్ నిలుస్తోంది. ♦ ఎంఫసిస్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో దాదాపు 3 శాతం క్షీణించి రూ. 454 వద్ద ముగిసింది. ఉద్యోగులు, మా మొత్తం మేనేజ్మెంట్ టీమ్‌కు ఈ డీల్ చాలా ఉత్సాహాన్నిచ్చింది. సంస్థ భవిష్యత్తు వృద్ధి జోరు, స్థిరత్వానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇక హెచ్‌పీలో నేను 20 ఏళ్లకుపైగానే పనిచేశా. ఇప్పుడు ఎంఫసిస్తోనూ ఏడున్నరేళ్ల అనుబంధం ఉంది. - గణేశ్ అయ్యర్, ఎంఫసిస్ సీఈఓ -
కార్వీ -ఎంఫసిస్ డీల్‌కు ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీపీవో సేవలను అందిస్తున్న ఎంఫసిస్‌లో కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ కొనుగోలు చేయనున్న వాటాకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే ఈ ఒప్పందం ఉందని పేర్కొంది. దీంతో బీపివో వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగినట్లు ఎంఫసిస్ తెలిపింది. మూడింట్ ఒకవంతు వాటాను రూ. 2.75 కోట్లకు కార్వీ డేటా మేనేజ్మెంట్ కొనుగులు చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.