విల్‌ యంగ్‌ అద్భుత శతకం.. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ ఘన విజయం | New Zealand Beat Netherlands In First ODI | Sakshi
Sakshi News home page

NZ VS NL: విల్‌ యంగ్‌ అద్భుత శతకం.. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ ఘన విజయం

Published Wed, Mar 30 2022 4:42 PM | Last Updated on Wed, Mar 30 2022 4:42 PM

New Zealand Beat Netherlands In First ODI - Sakshi

మౌంట్‌ మాంగనుయ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ (114 బంతుల్లో 103; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో సత్తా చాటడంతో కివీస్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. కైల్‌ జేమీసన్‌ (3/45), టిక్నర్‌ (4/50) ధాటికి 49.4 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది.  

రిప్పన్‌ (67), సీలార్‌ (43) రాణించడంతో నెదర్లాండ్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం ఛేదనలో యంగ్ సూపర్‌ శతకానికి తోడు ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌ (57) రాణించడంతో  కివీస్‌ 38.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్‌ 2న హ్యామిల్టన్‌లో జరుగనుంది. ఇదిలా ఉంటే సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఏకైక టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. 
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement