
నీటి కోసం కోతి తిప్పలు..
వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. జనానికే కాదు.. జంతుజాలానికీ గొంతులు ఎండుతున్నాయి. సోమవారం నర్సాపూర్ ఐబీ వద్ద తాగునీటి కోసం మర్కటాలు నానా తంటాలు పడ్డాయి. అక్కడున్న పైప్‌లైన్ నుంచి లీక్ అవుతున్న నీటి చుక్కలతో నోరు తడుపుకొనేందుకు క్యూ కట్టాయి. ఒకదాని తరువాత ఒకటి గొంతు తడుపుకొని వెళ్లిపోయాయి. - నర్సాపూర్