
జయపురం ఘాటీలో ఏర్పాటు చేసిన సైన్‌బోర్డు
కొరాపుట్: కోతులకు ఆహారం పెట్టొద్దంటూ కొరాపుట్-జయపురం ఘాటీలో జిల్లా అధికార యంత్రాంగం సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అక్తార్ ఆదేశాల మేరకు వీటిని సోమవారం ఏర్పాటు చేశారు. ఇదే మార్గంలోని మలుపుల వద్ద వాహనదారులు తమ వాహనాలను నిలిపి, ఇక్కడి కోతులకు ఆహారం ఇస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment