
పులి రాజాను చూసి కోతులు పరార్!
కొండముచ్చుతో కోతులను పారదోలడం వినే ఉంటారు. కానీ, ఓ వినూత్న ప్రయత్నంతో నల్లగొండ జిల్లా అర్వపల్లి రైతులు కోతుల బెడదను దూరం చేసుకున్నారు.
అర్వపల్లి (నల్లగొండ): కొండముచ్చుతో కోతులను పారదోలడం వినే ఉంటారు. కానీ, ఓ వినూత్న ప్రయత్నంతో నల్లగొండ జిల్లా అర్వపల్లి రైతులు కోతుల బెడదను దూరం చేసుకున్నారు. అర్వపల్లి మండలంలో కోతుల బెడద ఇటీవలి కాలంలో మరీ పెరిగిపోయింది. పంటలకు నష్టం కలిగిస్తుండడంతో రైతులు కొండ ముచ్చులను తీసుకొచ్చి కోతులను పంపించే ప్రయత్నం చేశారు.
పెద్దగా ఫలితం రాలేదు. దీంతో పులుల బొమ్మలను ప్రయోగించగా... సత్ఫలితం వచ్చింది. దాంతో రైతులు హైదరాబాద్ నుంచి పులిబొమ్మలను కొనుగోలు చేసి వాటిని పట్టుకుని పొలాల్లో కాపలాగా ఉంటున్నారు. అవి చూసి బెదురుతున్న కోతులు ఆ సమీపంలోకి రావడం లేదు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.