అనుమతి లేకుండా తీసుకొచ్చిన అరుదైన జాతికి చెందిన కోతులు
తిరువొత్తియూరు: మలేషియా నుంచి చైన్నెకి విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన అరుదైన జాతికి చెందిన నాలుగు కోతులను అధికారులు తిరిగి బుధవారం అదే విమానంలో మలేషియాకు పంపించారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. వారి దుస్తులను తనిఖీ చేశారు.
గంపలో మధ్య ఆఫ్రికాలోని పొడి అడవుల్లో ఉండే టీ ప్రిస్పా జాతి కోతులు, నైజీరియా, కెన్యా, ఉగాండా తదితర దేశాల్లో నివసించే మాంటా క్రోసా జాతి కోతులను గుర్తించారు. అరుదైన జాతులకు చెందిన నాలుగు కోతులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. వాటిని పెంచుకోవడానికి తీసుకువచ్చామని ప్రయాణికులు చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, వైద్యపరీక్షలు లేకుండా తీసుకుని వెళుతున్నట్టు గుర్తించి వాటిని తిరిగి అదే విమానంలో మలేషియాకు పంపించారు. కోతులను తీసుకువచ్చిన ఇద్దరిని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment