లోప్‌బురి: పర్యాటక ప్రేమికులకు థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోప్‌బురిలోని సాన ఫ్రా కాన, ఫ్రా ప్రాంగ్ సామ్ అనే పురాతన ఆలయాల ప్రాంగణంలో వేల కోతులు సందడి చేస్తుంటాయి. ఇక్కడి కోతులకు ఆహారం అందిస్తే సకల శుభాలు, ఐశ్వర్యం సిద్దిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాకుండా ప్రతీ ఏడాది ‘మంకీ బఫెట్ ఫెస్టివల్’అనే వినూత్న వేడుకను ఏర్పాటు చేసి అక్కడి కోతులకు పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందిస్తారు. ఈ వేడుకకు వివిధ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో లోప్‌బురి పర్యాటకంగా అభివృద్ది చెందడంతో పాటు కోతులకు కావాల్సినంత ఆహారం లభించేది. అయితే లాక్‌డౌన్‌తో సీన్ రివర్సయింది. (క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..)
ఇక పర్యాటకుల స్వర్గధామం అయిన థాయ్‌లాండ్‌పై కరోనా ప్రభావం భారీగానే పడింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇక లోప్‌బురిలో నివసించే వేల కోతుల కష్టాలు వర్ణనాతీతం. పర్యాటకులు లేకపోవడంతో వీటికి ఆహార కొరత ఏర్పడింది. దీంతో రోడ్లపైకి వచ్చి ఆహారం కోసం వెతుకులాట ప్రారంభించాయి. అక్కడి ప్రజలపై, దుకాణాదారులపై ఆహారం కోసం దాడి చేస్తున్నాయి. కొంత మంది వీటి దయనీయ పరిస్థితిని గమనించి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కోతుల దయనీయ పరిస్థితి అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఓ మై గాడ్ కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!)
Comments
Please login to add a commentAdd a comment