కోతుల తాత ఎవరో తెలియనుంది
లండన్ : మనుషులు, కోతులకు మధ్య పోలికలు ఎందుకు ఉన్నాయి? మిగతా జంతువుల మాదిరిగా మనుషులు ఎందుకు ఉండడం లేదు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు లండన్ యూనివర్సిటీ కాలేజీ అధ్యాపకులు సిద్ధమవుతున్నారు. కెన్యాలో 1.3 కోట్ల ఏళ్ల క్రితం నివసించినట్టుగా భావిస్తున్న అలేసి అనే కోతి మృతదేహాన్ని (జీవస్థశిల) పరిశోధించడం ద్వారా విలువైన సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు.
కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు, గిబ్బన్లు మనుషుల మాదిరే ఉంటాయి. అయితే వీటి మూలపురుషుడు ఎవరనేది మాత్రం ఇంత వరకు తెలియదు. ఈ కళేబరాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆఫ్రికాలో మానవుడి ఎదుగుల క్రమాన్ని కూడా అంచనా వేయవచ్చని యూనివర్సిటీ పరిశోధకుడు ఫ్రెడ్ స్పూర్ అన్నారు. ఇందుకోసం జీవస్థశిలను ఫ్రాన్స్‌కు తీసుకెల్లి 3డీ ఎక్స్–రే ద్వారా పరిశోధిస్తారు.