London university college
-
తగ్గుతున్న టీకా యాంటీబాడీలు
లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది. బూస్టర్ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్లు తీసుకున్న 600 మందిపై ఈ ప్రయోగం నిర్వహించినట్లు యూసీఎల్ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లు దాటిన అన్నిరకాల గ్రూపులవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై చేసిన పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో.. వ్యాక్సినేషన్ జరిగిన 21–41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మిల్లీలీటర్‌కు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. అదే 70 రోజులు దాటే సమయానికి 3320 యూనిట్లకు తగ్గిపోయాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విషయంలో వ్యాక్సినేషన్ జరిగిన 20 రోజుల్లోపు యాంటీబాడీ లెవెల్స్ 1201కి తగ్గాయి. 70 రోజులు దాటే సరికి ఆ సంఖ్య 190కి పడిపోయింది. అంటే దాదాపు అయిదు రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గిపోయాయి. కోవిషీల్డ్ 93 శాతం రక్షిస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. 98 శాతం మరణాలను తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఆర్మ్›్డ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని అన్నారు. -
వైరస్‌లో మార్పులతో ప్రమాదమేమీ లేదు
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్‌లో ఇప్పటివరకూ నమోదైన అన్ని జన్యు ఉత్పరివర్తనాలు (జన్యువుల్లో మార్పులు) ప్రమాదకరమేమీ కాదని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల్లోని సుమారు 15 వేల మంది కోవిడ్–19 రోగుల నుంచి సేకరించిన వైరస్ జన్యువులను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యాపకుడు ఫ్రాంకోయిస్ బలాక్స్ తెలిపారు. జన్యు ఉత్పరివర్తనాలతో కూడిన కరోనా వైరస్ సాధారణమైన దానితో పోలిస్తే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందా? అన్నది తెలుసుకునేందుకు తాము ఓ వినూత్నమైన పద్ధతిని ఉపయోగించామని, ఇప్పటివరకూ నమోదైన అన్ని జన్యుమార్పులతో ఆ ప్రమాదం లేదని స్పష్టమైందని ఆయన వివరించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకూ 6,822 ఉత్పరివర్తనాలు నమోదు కాగా వీటిల్లో 272 మార్పులు పదేపదే స్వతంత్రంగా జరిగాయని, వీటిల్లో 31 మార్పులు పదిసార్లు మార్పులు చెందినట్లు గుర్తించామని ఫ్రాంకోయిస్ తెలిపారు. ఈ మార్పుల్లో కొన్ని నిరపాయకరమైనవని తేలినట్లు చెప్పారు. -
ఒక వైపే చూడొద్దు..
లండన్ : జీవితంలో ఎప్పుడూ అంతా మంచే జరుగుతుందని ఒక వైపే చూడటం శ్రేయస్కరం కాదని తాజా అథ్యయనం పేర్కొంది. ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా గడ్డు పరిస్థితులను దీటుగా అధిగమించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి కొన్ని సందర్భాల్లో మేలు చేస్తుందని, కుంగుబాటును సమర్ధంగా ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైకాలజిస్టులు చేపట్టిన అథ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆశావహ దృక్పథం కలిగిన వారు సమయానుకూలంగా స్పందించడంలో తడబడితే, ఒత్తిడిని ఎదుర్కొనేవారు ఇలాంటి పరిస్థితులను సానుకూల దృక్పధంతో తీసుకోవడంతో పాటు వాటికి అనుగుణంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని తమ అథ్యయనంలో వారు గుర్తించారు. ఒత్తిడి మానవాళికి కొత్తేమీ కాదని, మన శరీరంలో ఉండే ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థ మనకు మేలు చేస్తుందని ప్రమాదకర పరిస్థితుల్లో ఇది మనల్ని అప్రమత్తం చేస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైకాలజిస్ట్ డాక్టర్ నీల్ గారెట్ చెప్పారు. అయితే ఒత్తిడి హార్మోన్లను మెరుగ్గా నిర్వహించడంతోనే మేలు చేకూరుతుందని, నిరంతర ఒత్తిడి మంచిది కాదని అథ్యయనం స్పష్టం చేసింది. అథ్యయన వివరాలు -
ఉద్యోగ ఒత్తిళ్లతో అకాల మరణం ముప్పు..
లండన్ : ఒత్తిడితో కూడిన ఉద్యోగంతో సతమతమయ్యే హృద్రోగాలతో బాధపడే పురుషులు మహిళలతో పోలిస్తే అకాల మరణానికి గురయ్యే అవకాశం అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. గుండె సమస్యలతో బాధపడే పురుషులు ఉద్యోగంలో ఒత్తిడికి లోనై అకాల మృత్యువాతన పడే అవకాశం మహిళలతో పోలిస్తే ఆరు రెట్లు అధికమని పరిశోధన పేర్కొంది. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులు శారీరకంగా దృఢంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఈ ముప్పు అధికమని పరిశోధన హెచ్చరించింది. అయితే ఉద్యోగ ఒత్తిళ్లతో అకాల మరణానికి లోనయ్యే ముప్పు మహిళల్లో ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళలతో పోలిస్తే పురుషులు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్ల కారణంగా వారి గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టుకునే అవకాశం అధికంగా ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు మొనోపాజ్ దశకు ముందు గుండె సమస్యలకు లోనవడం చాలా అరుదని అన్నారు. పురుషుల్లో ఈ ముప్పును తగ్గించేందుకు పనిగంటల తగ్గింపు, ఒత్తిడిని అధిగమించే చర్యలు చేపట్టడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని అథ్యయనం చేపట్టిన యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ మికా కివిమకి సూచించారు. పెద్దల్లో పనిచేయడం ఒత్తిడికి మూలకారణమని, తరాల కిందట మన శరీరాల్లో పొందుపరిచిన ఒత్తిడిని ఎదుర్కొనే సహజ గుణాలను ఆధునిక పనిస్వభావాలు సమూలంగా నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఒత్తిళ్లు పురుషుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ర్టోక్, డయాబెటిస్‌కు దారితీసి అకాల మరణానికి గురిచేస్తాయని తమ పరిశోధనలో స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. బీపీ, కొలెస్ర్టాల్ స్ధాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కటే అధిక రిస్క్‌ను దూరం చేయలేదన్నారు. 14 ఏళ్ల పాటు లక్ష మంది వైద్య రికార్డులను పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
కోతుల తాత ఎవరో తెలియనుంది
లండన్ : మనుషులు, కోతులకు మధ్య పోలికలు ఎందుకు ఉన్నాయి? మిగతా జంతువుల మాదిరిగా మనుషులు ఎందుకు ఉండడం లేదు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు లండన్ యూనివర్సిటీ కాలేజీ అధ్యాపకులు సిద్ధమవుతున్నారు. కెన్యాలో 1.3 కోట్ల ఏళ్ల క్రితం నివసించినట్టుగా భావిస్తున్న అలేసి అనే కోతి మృతదేహాన్ని (జీవస్థశిల) పరిశోధించడం ద్వారా విలువైన సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు, గిబ్బన్లు మనుషుల మాదిరే ఉంటాయి. అయితే వీటి మూలపురుషుడు ఎవరనేది మాత్రం ఇంత వరకు తెలియదు. ఈ కళేబరాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆఫ్రికాలో మానవుడి ఎదుగుల క్రమాన్ని కూడా అంచనా వేయవచ్చని యూనివర్సిటీ పరిశోధకుడు ఫ్రెడ్ స్పూర్ అన్నారు. ఇందుకోసం జీవస్థశిలను ఫ్రాన్స్‌కు తీసుకెల్లి 3డీ ఎక్స్–రే ద్వారా పరిశోధిస్తారు.