
భయంతో 12 కోతులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని ఓ అటవీ ప్రాంతంలో 12 కోతులు మృతి చెందడం కలకలం రేపింది. గుట్టగా కోతుల మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన గిరిజనులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కోతులకు ఎవరో విషమిచ్చి చంపి ఉంటారని తొలుత అధికారులు భావించారు. కానీ వైద్య పరీక్షల ఫలితాలను చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు.
భయం వల్ల కలిగిన గుండెపోటుతో కోతులు మరణించాయని రిపోర్టులో ఉంది. దీంతో పులి గాండ్రింపు శబ్దం విని కోతులు మరణించి ఉంటాయని భావిస్తున్నారు.