కోతులతో సావాసం.. మనుషులంటే వణుకు | Eight-year-old girl found living with monkeys in uttar pradesh | Sakshi
Sakshi News home page

కోతులతో సావాసం.. మనుషులంటే వణుకు

Published Thu, Apr 6 2017 8:54 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

కోతులతో సావాసం.. మనుషులంటే వణుకు

కోతులతో సావాసం.. మనుషులంటే వణుకు

బహ్రెయిక్‌: కోతులతో కలిసి ఉంటున్న ఓ ఎనిమిదేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్‌ బాలికలు రక్షించారు. పెద్ద మొత్తంలో గుంపులుగుంపులుగా ఉన్న కోతుల మధ్య ఆ బాలిక ఎలా ప్రమాదం లేకుండా ఉండగలిగిందో అని ఆశ్చర్యపోతున్నారు. ఆ బాలిక కనీసం మనుషుల్లాగా మాట్లాడటంగానీ, ప్రవర్తించడంగానీ చేయడం లేదు. పైగా మనుషులను చూసి తెగ భయపడుతోంది. ఈ వింత పరిస్థితుల్లో ఉన్న ఆ బాలికను ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. బహ్రెయిక్‌ ప్రాంతంలో రోజువారి మాదిరిగానే సురేశ్‌ యాదవ్‌ అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోతిపూర్‌ ప్రాంతంలో కటార్నియాఘాట్‌ వైల్డ్‌ లైఫ్‌ సాంక్చూరీలో పెట్రోలింగ్‌ చేస్తుండగా అతడికి కోతుల మధ్య ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలిక కనిపించింది. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఇతర అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఆ బాలికను తీసుకొచ్చేందుకు వెళ్లగా కోతులు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి.

వాటితోపాటు ఆ బాలిక కూడా కోతుల మాదిరిగానే చేయబోయింది. అతి కష్టం మీద ఆ బాలికను రక్షించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యానికి ఆ బాలిక స్పందిస్తోందని, అప్పుడప్పుడు మాత్రం హింసాత్మక ధోరణితో ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. అయితే, మెల్లగా మార్పు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నడవడం కూడా నేర్పిస్తున్నామని, అచ్చం జంతువుల మాదిరిగానే కాళ్లు చేతులను కలిపి ఆ బాలిక నడుస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement