ఎడాపెడా కరిచేస్తున్న కోతులు | monkeys more problems | Sakshi
Sakshi News home page

ఎడాపెడా కరిచేస్తున్న కోతులు

Published Sat, Nov 5 2016 12:36 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

ఎడాపెడా కరిచేస్తున్న కోతులు - Sakshi

ఎడాపెడా కరిచేస్తున్న కోతులు

సైదాబాద్‌లో కిష్కింధకాండ
ఎడాపెడా కరిచేస్తున్న కోతులు
80కి చేరిన బాధితుల సంఖ్య
బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
వానరాల బెడదతో చెన్నై రెలైక్కిన మహిళ

‘సైదాబాద్ పరిధి కల్యాణ్‌నగర్ కాలనీకి చెందిన సత్యవతి ఇంట్లో వంట చేస్తుండగా.. ప్రధాన ద్వారం గుండా వచ్చిన ఓ కోతి వెనకాల నుంచి ఆమె చెరుు్య పట్టుకుని గట్టిగా కొరికింది. భయంతో బయటకు పరుగులు తీసిన ఆమె...వెంటనే ఓ ఆస్పత్రికి వెళ్లి రూ.40 వేలు ఖర్చు చేసి వైద్యం చేరుుంచుకుంది. కోతి కరిచిన విషయాన్ని చెన్నైలో ఉండే కుమారుడికి ఫోన్ ద్వారా తెలిపింది. వెంటనే అతను శుక్రవారం టికెట్ బుక్ చేయగా ఇక్కడి కోతుల భయానికి బాధితురాలు చెన్నైకి బయలుదేరి వెళ్లింది’...ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. సైదాబాద్ ప్రాంతంలో కోతులు ప్రజలను హడలెత్తిస్తున్నారుు. ఇప్పటి వరకు దాదాపు 80 మందిని కరిచి గాయపర్చారుు.  - సైదాబాద్
 

సైదాబాద్:  సైదాబాద్ స్థానిక ప్రజలను ఇప్పుడు కోతులు బెంబేలెత్తిస్తున్నారుు. స్థానికంగా కోతుల సమూహంలో ఉన్న రెండు కోతులు మతిస్థిమితం కొల్పోరుు కనిపించిన వారిపై పడి కరిచి పారిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉదయాన్నే పాల ప్యాకెట్లు తెచ్చేందుకు బయటకు వచ్చిన వారిపైన, వాకింగ్‌కు వెళ్లే వారు కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కుక్క కాటు కంటే ఎక్కువగా కోతులు కరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఓ మతిస్థిమితం లేని కోతి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని స్థానికులు  భయం భయంగా గడుపుతున్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులను కూడ పిచ్చెక్కిన కోతి వదలడం లేదు. తలపైకి ఎక్కి ముఖాన్ని గోళ్లతో గీరుతూ, నోటితో కొరికి పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. సైదాబాద్ డివిజన్ వీకేదాగ్‌నగర్‌లో శుక్రవారం ఒక్క రోజే 20 మందిని కోతి కరవడం గమనార్హం. కళ్యాణ్‌నగర్‌లో 30, ఎస్‌బీహెచ్ ఏ, బీ, సీ కాలనీలో 30 మందిని గాయపర్చింది. ఇప్పటికే బాధితుల సంఖ్య 80కి చేరిందని స్థానికులు చెబుతున్నారు.  కోతి కరిచిన వెంటనే బాధితులను కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత శ్రీనివాస్‌రెడ్డి వైద్యం కోసం నారాయణగూడ ఆసుపత్రికి తరలిస్తున్నారు. స్థానికంగా కోతి కాటుకు సంబంధించి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని చెబతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రరుువేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.వేలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు, చికిత్సలు చేరుుంచుకుంటున్నామని బాధితులు వాపోతున్నారు.
 

జాలీల ఏర్పాటు
కోతుల పట్టుకోడానికి రంగంలోకి దిగిన జూ సిబ్బంది కల్యాణ్‌నగర్, వీకేదాగ్‌నగర్, సీ కాలనీలో పార్కులు, ఇళ్లపైన జాలీలను ఏర్పాటు చేశారు. నిన్న రెండు కోతులను పట్టుకున్నప్పటికీ మతిస్థిమితం లేని కోతి జాడ దొరక్కపోవడంతో దాని కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్పొరేటర్ స్వర్ణలతరెడ్డి  ప్రత్యేక శ్రద్ధపెట్టి ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అరుునా ఆ కోతి దోరక్కపోవడంతో అందరు భయంభయంగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్క రోజులోనే 50 మంది బాధితులు పెరిగారు. పరిస్థితి ఇలాగే ఉంటే జనం భయటకు రావాలంటేనే జంకే దుస్థితి నెలకొంది.
 

కోతులను పట్టుకోవాలి
సైదాబాద్ డివిజన్‌లో సంచరిస్తున్న కోతులను పట్టుకోడానికి జూ సిబ్బందితో పాటు ఫారెస్ట్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలి. లేదంటే ఇక్కడి జనం కోతుల బారిన పడి మరింత మంది గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. కోతులను పట్టడంలో నేర్పరిలను తీసుకొచ్చి ఇక్కడి కోతులను తీసుకెళ్లే పయత్నం చేయాలి. బాధితుల కోసం వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. - సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, కార్పొరేటర్
 

వెంటనే చర్యలు తీసుకోవాలి
కోతుల బారి నుంచి సైదాబాద్ డివిజన్ ప్రజలను రక్షించే ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే ఎంతో మందిని కరిచివెళ్లింది. వైద్యం చేరుుంచుకోవాలంటే రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రాజేష్ అనే వ్యక్తి వైద్యానికి ఇప్పటికే రూ. 5 వేలు దాటింది. జూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కోతులను పట్టుకునే విధంగా కృషి చేయాలి.   - కిష్టయ్య, బ్యాంకు కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement