
తిరుమలలో భక్తులపై కొండముచ్చుల దాడి
తిరుమలలో కోతులు స్వైరవిహారం చేశాయి.
తిరుమల: తిరుమలలో కొండముచ్చులు స్వైరవిహారం చేశాయి. తాజాగా సోమవారం జీఎన్సీ టోల్‌గేట్ వద్ద నడకదారి భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భక్తులు, తమిళనాడుకు చెందిన మరొకరు, టీటీడీ ఉద్యోగిపై దాడి చేశాయి.
గాయపడిన వారిని స్థానిక అశ్విని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కొండముచ్చులు దాడులకు దిగుతున్నాయి. ఇప్పటివరకూ ఏడుగురు వీటి బారిన పడి గాయాల పాలయ్యారు. మరోవైపు అలిపిరి నుంచి తిరుమలకు నడక దారిన వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు.